సినిమా వార్తలు లేకపోవడంతో మీడియా సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి వారు బయటపెట్టే సీక్రెట్స్ ను హైలెట్ చేస్తూ వార్తలు రాస్తోంది. ఇలాంటి నేపధ్యంలో తమిళ హీరో ఒకనాటి టాప్ హీరోయిన్ రాధిక భర్త శరత్ కుమార్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి వ్యక్తిత్వం పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం మెగా అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి.


చిరంజీవి రాధికతో ఎన్నో సినిమాలలో నటించిన నేపద్యంలో రాధిక భర్త శరత్ కుమార్ తో కూడ మంచి సాన్నిహిత్యం ఉంది. తెలుగు తమిళ మళయాళ కన్నడ భాషలలో సుమారు 100కు పైగా సినిమాలలో నటించిన శరత్ కుమార్ మంచి నటుడు మాత్రమే కాకుండా రచయితగా నిర్మాతగా దర్శకుడుగా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 


దీనికితోడు అనేక వివాదాలకు చిరునామాగా తమిళ ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగే శరత్ కుమార్ గతంలో నిర్మాతగా తాను తీసిన అనేక సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ఆర్ధిక బాధలలోకి వెళ్ళిపోయాడు. దీనితో గతంలో అతడి పై ఆర్ధిక ఒత్తిడిలు హెచ్చుగా ఉండేవి. ఇలాంటి పరిస్థితులలో తాను తిరిగి ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి చిరంజీవి తనకు గతంలో చేసిన సహాయం తాను జీవితంలో మరిచిపోలేను అంటూ శరత్ కుమార్ అప్పటి విషయాలను ఇప్పుడు గుర్తుకు చేసుకున్నాడు. 


గతంలో తాను తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పుడు ఒక నిర్మాత తన వద్దకు వచ్చి తనకు చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఇప్పిస్తే తాను షేర్ ఇస్తాను అని ఆఫర్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. దీనితో ఏదోవిధంగా ఆ అప్పుల నుండి బయటపడదామని తాను ఈ విషయాన్ని చిరంజీవిని కలిసి తన బాధలను వివరిస్తే ఆ సినిమా కథ కూడ వినకుండా కనీసం పారితోషికం గురించి కూడ ప్రస్తావించకుండా చిరంజీవి ఆ సినిమాలో నటించి తాను ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో సహకరించాడు అని చెప్పిన శరత్ కుమార్ మాటలు ఇప్పుడు మెగా అభిమానుల మధ్య తెలుగు మీడియా వర్గాలలో హైలెట్ గా మారాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: