అర్జున్ రెడ్డి... ఈ సినిమా గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా ఇండియన్ సినిమాలో అయినా సరే ఈ సినిమా ఒక సంచలనం. అప్పటి వరకు ఇలాంటి కథలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా లేక వివాదాలు అవుతాయా అనే భయంలో ఉండే దర్శక నిర్మాతలు చాలా మంది ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి బాలీవుడ్ కి కొన్ని కొన్ని కొత్త పరిచయాలు చేసారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కష్టపడిన విధానం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కష్టపడిన విధానం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అనేది వాస్తవం. 

 

ఆయన ఈ సినిమా తో స్టార్ హీరో గా మారిపోయాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ నటన కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అనేది కూడా వాస్తవం. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసారు. షాహిద్ కపూర్ హీరో గా ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చింది. అక్కడ కూడా ఈ సినిమాను ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు అనేది వాస్తవం. ప్రేక్షకులకు ఈ సినిమా చాలా బాగా దగ్గరైంది. షాహిద్ కపూర్ కి నటుడిగా కూడా ఈ సినిమా తర్వాత మంచి పేరు వచ్చింది. గతంలో ఉన్న పేరు రెట్టింపు అయింది. కథ కు తగిన విధంగా నటించాడు. 

 

హీరోయిన్ కూడా బాలీవుడ్ లో చాలా బాగా ఆకట్టుకుంది అనేది తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి బాలీవుడ్ కూడా కొన్ని కొత్త పాఠాలు నేర్చుకుంది అనేది అందరూ అనే మాట. ఎలాంటి ప్రయోగం చేసినా సరే ధైర్యం ఉండి కథ లో పట్టు ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు అనేది బాలీవుడ్ గుర్తించింది. మన తెలుగులో కూడా ప్రయోగాలకు రెడీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: