శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమాకు కూడా కరోనా సెగ తగిలింది.  జస్ట్ ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలున్న ఈ సినిమాకూడా ఏప్రిల్  స్టార్టింగ్ లో రిలీజ్ అవ్వాల్సింది. నెల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంకో రెండు నెలలకు కూడా రిలీజ్ కాదేమో అని ఆలోచిస్తున్నాడు  నాగచైతన్య.

 

సాయిధరమ్ తేజ్ హీరోగానభా నటేష్ హీరోయిన్ గా సుబ్బు డైరెక్షన్ లో తెరకెక్కుతునన సినిమా సోలో బ్రతుకే సో బెటరూ. ఇంట్రస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 1  మేడే రోజు రిలీజ్ అవ్వాల్సి ఉంది. థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో ఈ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ  కి సంబందించి షూటింగ్ కూడా ఇంకో వారం పదిరోజుల్లో అయిపోయేది. కానీ కరోనా డిస్టర్బ్ చెయ్యడంతో ప్లాన్ మొత్తం వెనక్కివెళ్లిపోయింది. 

 

అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ . పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 17 న రిలీజ్ చేద్దామనుకున్నారు. రీసెంట్ గా షూటింగ్ పోస్ట్ పోన్ చెయ్యడంతో లాస్ట్ షెడ్యూల్ లో ఇంకో వారం రోజులు  యాక్షన్ పార్ట్ షూట్ చెయ్యాల్సి ఉంది. కానీ ఇప్పుడు మొత్తానికే షూటింగ్ లు ఆపేయ్యడంతో చేసేదేం లేక  వెయిట్ చేస్తున్నాడు అఖిల్ .  

 

శర్వానంద్  నటిస్తున్న శ్రీకారం సినిమా ఏప్రిల్ 24 న రిలీజ్ అనౌన్స్ చేశారు . కానీ షూటింగ్ పోస్ట్ పోన్ చెయ్యడంతో ఇంకా లాస్ట్ షెడ్యూల్ పెండింగ్ పడిపోయింది. అనౌన్స్ చేసిన టైమ్ కి రెడీ అవ్వదేమో అన్న డౌట్ తో రిలీజ్ పోస్ట్ పోన్ చేసేశారు యూనిట్. రామ్ డ్యూయల్ రోల్ లో తమిళ్ హిట్ మూవీ తడమ్ కి రీమేక్ గా వస్తున్న రెడ్ సినిమా ఏప్రిల్ 9 న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే షూటింగ్స్ అన్నీ రీ షెడ్యూల్ అవ్వడంతో ఈ సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయ్యింది. జస్ట్ చిన్న చిన్న కరెక్షన్స మినహా.. సినిమా ఫస్ట్ కాపీ కూడా రెడీ చేసుకుంది టీమ్. కానీ   ఇప్పుడు అటు షూట్ చెయ్యలేక.. ఆ టైమ్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాడు రామ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: