తమిళ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన గజిని సినిమా భారత దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను ఎంతోగానో అలరించింది. 2005 సంవత్సరంలో విడుదలైన గజినీ చిత్రంలోని సంజయ్ రామస్వామి హ్యాండ్సమ్ హీరో సూర్య నటించగా... మోడల్ కల్పన పాత్రలో కేరళ ముద్దుగుమ్మ ఆసిన్ నటించారు. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్ రావత్ నటించగా... నయనతార మెడికల్ స్టూడెంట్ పాత్రలో నటించింది. సంజయ్ రామస్వామి వ్యాపారవేత్త కాగా ఒకానొక రోజు ఆయన ఆసిన్ అంగవైకల్యం గల పిల్లలను రోడ్డు దాటిస్తుంటే చూస్తాడు. ఆపై ఆమెపై మనసు పారేసుకుంటాడు.


మరోవైపు తన మోడలింగ్ రంగంలో గౌరవ మర్యాదలు రావాలనే ఉద్దేశ్యంతో సంజయ్ రామస్వామి తనని ప్రేమిస్తున్నాడని కల్పన చెబుతోంది. దాంతో ఈ వార్త తెగ వైరల్ అవ్వడంతో సంజయ్ రామస్వామికి కూడా కల్పన గురించి తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలా అబద్దం ఆడుతుందనే కోపం తో ఆమెను నిలదీయడానికి వెళ్లిన సంజయ్ రామస్వామి కి తాను మనసుపడ్డ అమ్మాయే కల్పన అని తెలుస్తుంది. ఆశ్చర్యపోయిన సంజయ్ తను ఎవరో చెప్పకుండా తనని ఓ పేదవాడిగా ఆమెకి పరిచయం చేసుకుంటాడు. ఆ క్షణం నుండి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అయితే ఎప్పుడైతే కల్పన రామ్ లక్ష్మణ్( ప్రదీప్ రావత్) గుండాల చేతిలో బలవుతుందో, సంజయ్ తలకు గాయమై జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడటం మొదలవుతుందో అప్పటి నుండి సినిమా మొత్తం విషాదకరంగా మారుతుంది. తన ప్రియురాలిని చంపిన ప్రతి ఒక్కరిని గుర్తించుకోవడం కోసం సంజయ్ ఒక కెమెరా కొనుక్కొని విలన్ ని పట్టుకొని చంపేస్తాడు.


ఐతే నిజానికి ఈ సినిమా మొత్తం హాలీవుడ్ మూవీస్ నుండి రీమేక్ కాబడింది. 2000 సంవత్సరంలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మొమెంటో చిత్రంలో కూడా హీరో ప్రియురాలిని ఇద్దరు గుండాలు అతికిరాతకంగా చంపుతారు, హీరో తలపై గట్టిగా మోదడంతో తన జ్ఞాపక శక్తి చెడిపోతుంది. ఐతే ఆ ఇద్దరిని చంపడానికి హీరో ఒక కెమెరా కొనుక్కొని నిందితులను ట్రేస్ చేయడానికి, గుర్తుంచుకోవడానికి ఒంటినిండా పచ్చబొట్లు పొడిపించుకోవడం తో పాటు ఇంట్లో పెద్ద మ్యాప్ రూపొందించుకొని వందల కాగితాల పై సమాచారం మొత్తం రాసుకుంటుంటాడు. జ్ఞాపక శక్తి కోల్పోయినా తన ప్రియురాలిపై ప్రేమతో ఆమెను చంపిన వారిని ఎట్టకేలకు అంతమోదిస్తాడు. ఈ మొమెంటో సినిమా మొత్తం గజిని లో ఒక పార్టు లాగా చూపించబడింది. ఐతే వ్యాపారవేత్తలకు మోడలింగ్ చేసే యువతికి మధ్య ప్రేమ పుట్టుకు రావడం అనేది మురుగదాస్ ఒరిజినల్ ఆలోచన కాదు. వాస్తవానికి గజిని సినిమాలో చూపించిన ప్రేమ కథ హ్యాపీ గో లవ్లీ(1951) అనే బ్రిటిష్ రొమాంటిక్ చిత్రం నుండి స్ఫూర్తిగా తీసుకొనబడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: