ఈ ఏడాది త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అలా వైకుంఠపురములో’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది.. ఓ ముఖ్యపాత్రలో  సుశాంత్ నటించాడు. ఈ మూవీకి మరో ప్రాణం సంగీతం.. రిలీజ్ కి ముందే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సామ జవరగమనా, రాములో రాములా, బుట్ట బొమ్మా అనే సాంగ్స్ యూట్యూబ్ సంచలనాలు రేపాయి.  ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి చేయడం వల్ల లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో సెలబ్రెటీలు ఇంటి వద్ద ఉంటూ.. వీడియోలు, టిక్ టాక్, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  ముఖ్యంగా స్టార్ క్రికెటర్లు ఈ మద్య తెలుగు, తమిళ, హిందీ సాంగ్స్ టిక్ టాక్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు. 

 

ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఇటీవల తెలుగు సినిమా పాటలు, డైలాగులపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే బుట్టబొమ్మా బుట్టబొమ్మా పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించిన వార్నర్, పోకిరిలో హిట్ డైలాగ్ చెప్పి మరింత విస్మయానికి గురిచేశాడు. ఇప్పుడు రాములో రాములా పాటకు తన కుటుంబ సభ్యులతో కలిసి వార్నర్ టిక్ టాక్ లో మరో వీడియో చేశాడు.  తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ త‌న‌దైన శైలిలో డ్యాన్స్ చేశారు.

 

కెవిన్ పీట‌ర్స‌న్ కొద్ది రోజులుగా టిక్ టాక్‌లో అనేక వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా బుట్ట‌బొమ్మ సాంగ్‌కి హుక్ స్టెప్స్ వేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు. నా డ్యాన్స్ మెరుగుప‌డుతుందా అంటూ వీడియోకి కామెంట్ కూడా ఇచ్చాడు. ట‌వ‌ల్ క‌ట్టి కెవిన్ వేసిన స్టెప్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బుట్ట‌బొమ్మ సాంగ్ ఇటీవ‌ల 150 మిలియ‌న్స్‌‌కి పైగా వ్యూస్‌ని క్రాస్ చేసిన విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: