2014వ సంవత్సరంలో తెలుగులో విడుదలైన థ్రిల్లర్ మూవీ దృశ్యం లో వెంకటేష్, మీనా, నదియా, కృతిక జయ్ కుమార్, నరేష్, రోషన్ బషీర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో అరకు ప్రాంతంలోని రాజవరం గ్రామంలో రాంబాబు(వెంకటేష్) అనే ఒక కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్ తన భార్య జ్యోతి(మీనా) పిల్లలు అంజు(కృతిక), అను లతో కలసి జీవితం సాగిస్తుంటాడు. ఈ మధ్యతరగతి కుటుంబంలో చిన్న చిన్న అలకలు తప్ప మరే ఇతర పెద్ద సమస్యలు చోటు చేసుకోవు. రాంబాబు కేబుల్ ఆపరేటర్ కాబట్టి తన ఆఫీసులో కేబుల్ నెట్వర్క్ ని పరీక్షిస్తూ వీలు చిక్కినప్పుడల్లా ఎన్నో పలు భాషల సినిమాలను చూస్తూ ఉండేవాడు. ఆ సినిమా ల ఈ కారణంగానే తనకు తన లైఫ్ సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనాశక్తి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.


తాను చదివింది కేవలం 7వ తరగతి అయినప్పటికీ... తెలివితేటలు మాత్రం ఐఏఎస్ పాసైన విద్యార్థి స్థాయిలో చురుకుగా ఉంటాయి. సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ కుటుంబంలో వరుణ్ అనే ఓ దుర్మగుడు అడుగుమోపి వారి జీవితాలలో తీవ్ర విషాదాన్ని నింపుతాడు. అంజు విహార యాత్రలకు వెళ్లిన సమయంలో తను స్నానం చేస్తుండగా తన తోటి క్లాస్మేట్ అయిన వరుణ్ వీడియో తీస్తాడు. ఆ వీడియో ని చూపిస్తూ తన కామ వాంఛ తీర్చాలని వేధిస్తాడు. దాంతో అంజు తన తల్లితో చెప్పగా... ఆమె అతడికి సర్ది చెప్పడానికి వస్తుంది. కానీ వరుణ్ మాత్రం ఆమె కూడా తన శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే... వారు తనని అంతమోదిస్తారు.


ఈ విషయం రాంబాబుకి తెలియడంతో... ఆ హత్యను కప్పిపుచ్చేనందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. మృతి చెందిన వరుణ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన గీత( నదియా) కుమారుడు కావడంతో మర్డర్ విచారణ చాలా కట్టుదిట్టంగా జరుగుతుంది. వీటన్నిటిని నుండి రాంబాబు ఎత్తులు పైఎత్తులు వేస్తూ తన కుటుంబం జైలు పాలు అవ్వకుండా గట్టెక్కిస్తాడు. చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగే ఈ థ్రిల్లర్ మూవీ అందరినీ ఎంతగానో అలరించింది. అయితే దృశ్యం మూవీ మలయాళంలో అదే పేరుతో తెరకెక్కిన దృశ్యం మూవీ కి రీమేక్. ఈ ఒరిజినల్ చిత్రంలో మోహన్ లాల్ మీనా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: