టాలీవుడ్ ఎంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌మ‌యంలో వ‌చ్చిన చిత్రం `టెంప‌ర్‌`.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. మ‌ళ్లీ ఎన్టీఆర్‌ను స‌క్సెస్ ట్రాక్ ఎక్కించింది. మ‌రియు ఈ చిత్రం నటుడిగా తారక్‌ను మరో మెట్టు పైకెక్కించింది. సోషల్ కాజ్ ఉన్న కంటెంట్‌కు పూరీ మార్క్ ఇంటెన్సిటీతో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించారు. అప్ప‌ట్లో ఈ చిత్రం సన్సేషన్ హిట్ అని చెప్పుకోవాలి.

 

ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తే.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని పలు భాషల్లో రీమేక్ చేసారు. టెంపర్ మూవీని హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో తెరకెక్కింది. అక్కడ కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించింది. ఇక అదే సినిమాను తమిళ్ లో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ చేయగా తమిళ్ లో ఆడియన్స్‌ను ఓ మోస్త‌రుగా ఆక‌ట్టుకుంది. ఎ.ఆర్.మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా హీరోయిన్.

 

అయితే తెలుగులో సూప‌ర్ హిట్ అయిన టెంప‌ర్ సినిమా వేరే భాషలో రీమేక్ అయ్యి అది మళ్ళీ తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అవ్వ‌డం..  మ‌రియు ఆ సినిమాను మంచి రేటు ఇచ్చి బయ్యర్లు కొనడం విచిత్రాలే అని చెప్పుకోవాలి. వాస్త‌వానికి ఆ సినిమా రిలీజ్ సమయం లో తెలుగు లో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయనని చెప్పిన హీరో విశాల్ తర్వాత మనసు మార్చుకుని సినిమా ను ఇటీవ‌ల‌ తెలుగు లోనూ డబ్ చేసి రిలీజ్ చేశాడు. తెలుగులో ఎన్టీఆర్ మాదిరి కాకపోయినా.. తన రేంజ్‌లో విశాల్ నట విశ్వరూపం చూపించాడు.  కానీ, తెలుగులో ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అస‌లు ప్రేక్ష‌కులు ఎన్టీఆర్ ప్లేస్‌లో మ‌రెవ్వ‌రినీ ఊహించుకోలేక‌పోయారు. అంత‌లా ఎన్టీఆర్ ఇన్‌స్పెక్టర్ దయా పాత్రలో ఒదిగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: