తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్  సినిమాల హవా ఎక్కువగా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇతర భాషల్లో మంచి విజయాలను సాధించిన సినిమాలను కథలో కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాలను తెరకెక్కించి భారీ విజయాలను అనుకుంటూ ఉంటారు దర్శకనిర్మాతలు. అటు  హీరోలు కూడా ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ లలో  నటించడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో రీమేక్ సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కి సంచలన విజయాలను నమోదు చేశాయి కూడా. 

 

 

 ఇలాంటి సినిమాలలో ఒకటి పవిత్ర బంధం. వెంకటేష్ హీరోగా సౌందర్య హీరోయిన్ గా ఎస్పీ బాలసుబ్రమణ్యం ముఖ్య పాత్రలో నటించిన సినిమా పవిత్ర బంధం. ఈ సినిమా విడుదలై వెంకటేశ్ కెరీర్ లో ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన పరంగా వెంకటేష్ సౌందర్య విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఒక పేద కుటుంబంలో జన్మించిన సౌందర్య.. ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన వెంకటేష్ మధ్య జరిగే సంభాషణలు.. సంఘటనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

 

 

 ఇక పవిత్ర బంధం సినిమా కన్నడ సినిమా అయిన మాంగల్యం తంతునానేనా అనే సినిమా నుంచి రీమేక్ చేశారు. కన్నడలో మాంగల్యం తంతునానేనా సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాని తెలుగులో పవిత్ర బంధం పేరుతో రీమేక్ చేసి ఇక్కడ మంచి విజయాన్ని అందుకున్నారు దర్శక నిర్మాతలు. ఒక సంవత్సరం పెళ్లి అగ్రిమెంట్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా... ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఎంతగానో అలరించి  మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: