తెలుగులో బ్లాక్ బాస్టర్ సినిమాలు చాలానే ఉన్నాయి.. దాంతో ఇప్పుడు వారానికి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అన్నిటికన్నా కూడా హర్రర్ జోనర్ లో వచ్చిన సినిమాలు ఎక్కువగా హిట్ అయిన సంగతి  తెలిసిందే.. అయితే ఇప్పడు వస్తున్నా సినిమాలు రొమాన్స్ పేరుతో కొంచం ఆ టైపు సినిమాలు ఎక్కువ దర్శనమిస్తున్నాయి. 

 

 

 

అప్పటి సినిమాలు విషయానికొస్తే అమ్మోరు, దేవి , నాగదేవత ,  శ్వేత నాగు .. ఇలా చాలా సినిమాలు ప్రేక్షకుల మన్నలను అందుకున్న సినిమాలే.. ఆ సినిమాలలో ప్రేక్షకులను ఆలోచించే సన్నివేశాలతో సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటి కాలంలో  అలాంటి సినిమాలు అంటే ముఖ్యంగా వినిపించే పేరు చంద్రముఖి , అరుంధతి.. 

 

 

ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయినా సినిమాలే.. అయితే చంద్రముఖి సినిమా విషయానికొస్తే ఈ సినిమా మొత్తం రాజుల కాలంలో సినిమా గా అందరికి నచ్చింది.ఆనాటి కాలంలో రాజులు కంటికి కనిపించిన అమ్మాయిని తీసుకురావడం వాళ్ళతో ఎంజాయ్ చేయడం చేసేవారు. ఒక వేల వాళ్లకు పెళ్ళైతే వారి భర్తలను చంపడం వారిని బలవంతంగా అనుభవిస్తారు. అలాంటి కథలతో  చంద్రముఖి సినిమా కూడా రూపొందింది.. అయితే ఈ సినిమాలో చనిపోయిన ఆత్మ రాజుపై పగను పెంచుకొని  బంగ్లాలో ఉంటుంది. హీరో రాజు లాగ ఆ ఆత్మను ఆ ఇంటి నుంచి  బయటకు  పంపిస్తాడు. ఆ నేపథ్యంలో సాగే సన్నీ వేశాలు  భయాన్ని కలిగించడం తో  పాటుగా అభిమానులను ఆలోచింప చేయడంతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకా ఈ సినిమాలో రజిని కాంత్ నటించడంతో సినిమా భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి. ఆ సినిమాకు  సీక్వెల్ సినిమా వస్తే హిట్ అవుతుందని అందరు ఆలోచిస్తున్నారు. మరి అందరి కోరిక మేరకు సినిమా వస్తుందో లేదో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: