సన్నీ లియోన్... ఈ పేరు తెలియని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు.. ఈ పేరు తెలియని నెటిజన్  లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. శృంగార తారగా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగి... ఎంతోమందికి శృంగార దేవత గా మారిపోయింది సన్నీలియోన్. పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించి.. ఎన్నో పోర్న్ సినిమాలలో నటించింది సన్నీలియోన్. ఇక తన సహ పోర్న్ స్టార్  అయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు శృంగార తారగా కొనసాగిన సన్నీ లియోన్ ఆ తర్వాత తన మనసు మార్చుకుంది.. పోర్న్ స్టార్గా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ తన కెరీర్కి పుల్ స్టాప్ పెట్టి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది  సన్నీ లియోన్. 

 

 

 అయితే సన్నీ లియోన్ బాలీవుడ్ లో హాట్ హాట్ ఐటమ్ సాంగ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో సినిమా రంగం వైపు వచ్చినప్పుడు సన్నీ లియోన్ కు పలు విమర్శలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ తట్టుకొని ప్రస్తుతం ఒక మంచి నటిగా బాలీవుడ్ లో కొనసాగుతుంది సన్నీ లియోన్. అయితే ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఉండి కూడా ప్రస్తుతం సినిమా రంగంలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది సన్నీలియోన్. మామూలుగా అయితే శృంగార తారగా ఉన్నవారికి బయట సమాజం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. 

 

 

అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది సన్నీ లియోన్. అయితే సన్నీ లియోన్ ఏకంగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారిని పెంచుకుంటూ తన మంచి మనసు చాటుకున్నారు. వీరిద్దరూ తమ కన్న పిల్లల్లాంటి  వాళ్లని వారిని  ఎంతో ప్రేమగా చూసుకుంటాను  అంటూ తెలిపింది. ఒకప్పుడు పోర్న్ స్టార్ అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం సన్నీ లియోన్ అందరికీ ఆదర్శంగా నిలిచే లా ఒక మంచి మనిషిగా జీవిస్తుంది అనే చెప్పాలి. కాగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సన్నీలియోన్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే  విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: