తెలుగులో విజయ్ దేవరకొండ తర్వాత ఆ స్థాయిని మించిన హీరో ఆర్ ఎక్స్ 100 కార్తికేయ.. మొదటి సినిమాతో బాగా పాపులారిటీని సొంతం చూసుకున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే మొదటి సినిమా ఓ రేంజులో హిట్ అవ్వడంతో రెండో సినిమా కూడా హిట్ అవుతుందని చాలా అసలు పెట్టుకున్న ఈ హీరో కి నిరాశే ఎదురైంది. 

 

 

 

 

 

 

రెండో సినిమాగా హిప్పీ సినిమాలో రొమాంటిక్ అబ్బాయి పాత్రలో నటించాడు కానీ ఆ సినిమా కూడా ఈ కుర్రాడికి హిట్ ఇవ్వలేదనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన గుణ ౩69  సినిమా కూడా ఈ కుర్రాడికి హిట్ ఇవ్వలేదనే చెప్పాలి. దీనితో బాడీ ఉంటె సరిపోదు బ్రెయిన్ ఉండాలి అని అనుకున్నాడేమో మొన్న వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

 

 

 

 

 

తర్వాత 90 ఏం ఎల్ సినిమాలో నటించాడు.. పేరుకు తగ్గట్లే సినిమా మొత్తం తాగుడు గురించి ఉంది.  మా డాక్టర్ రోజుకు కొద్దిగా మందు తాగమన్నాడు అంటూ హీరో చెప్పే డైలాగు ఆ సినిమాకు ఊపును తీసుకొచ్చింది. మొన్న రిలీజ్ అయినా అనుకున్నంత హిట్ నీ అందించలేక పోయింది. 

 

 

 

 

ప్రస్తుతం ఈ సినిమాలో మరో పోస్టర్  వచ్చింది ఆ పోస్టర్ లో హీరో కి ప్రియురాలు పాలసీసాలో మందు వేసి చిన్నపిల్లాడికి తాపిస్తుంది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇకపోతే ఈ ఇలాంటి ప్రేయసి ఉంటె ఏ ప్రియుడు మాత్రం ఆమెను వదిలేస్తాడు అంటూ అందరు కామెంట్లతో నింపేస్తున్నారు.ఆ సినిమా కూడా ఆ హీరో కు హిట్ నీ ఇవ్వలేక పోయింది.. ఇప్పుడు సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: