ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 11, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 12,  కృష్ణాలో 3, కర్నూలులో 7 చొప్పున కేసులు నమోదయ్యాయని వివరించింది ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ.దీనితో మొత్తం నిన్న కొత్తగా 48 కేసులు మనోదయ్యాయి.

 

గత 24 గంటల్లో ఏపీలో 9,284 శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. ఇందులో 48 శాంపిల్స్‌కు కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. చికిత్స అనంతరం కరోనా నుంచి నిన్న ఒక్కరోజే 86 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు. ఓవరాల్‌గా రాష్ట్రంలో నమోదైన మొత్తం 2137 పాజిటివ్ కేసులకుగాను 1,142 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 47 మంది కరోనా కాటుకు బలయ్యారు.

 

గత వారం రోజుల నుండి చిత్తూరు కిల్లాలో పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. చాలా క్రమంగా కేసులు నమోదు కావడం ఇంకా అనుమానితులు జిల్లా నలుమూలల్లో వ్యాపించి ఉండడం కూడా ఇప్పుడు జిల్లా ప్రజల్లో ఆందోళన నింపింది. నిన్న ఒక్క రోకే అత్యధికంగా 11 కేసులు నమోదు కావడమే ఇందుకు ఉదాహరణ. కొద్ది రోజుల్లోనే ఈ అనూహ్య మార్పు చోటు చేసుకోవడం గమనార్హం.

 

ఇక పోతే అటు కర్నూలు మరియు గుంటూరు జిల్లాలు ఎప్పటిలాగే ఎక్కువ కేసుల లిస్టులలో టాప్ లో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు సంఖ్య స్థిరంగా ఉంది అనే చెప్పాలి. ఇక ఇతర రాష్ట్రాల కేసులు ఒక 73 వరకూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: