ప్రపంచంలో కరోనా వైరస్ తో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు.  రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. మరణాల సంఖ్య కూడా తీవ్రం అవుతున్నాయి.  ఒక్క అమెరికాలోనే 75 వేల మరణాలకు పైగా సంబవించాయంటే కరోనా తీవ్రత ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది.  న్యూయార్క్ లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. పేషెంట్లకు సరిపడా హాస్పిటల్స్ లేకపోవటంతో చాలా మందికి ట్రీట్ మెంట్ అందటం లేదు. ఇలాంటి వారంతా ఇళ్లలోనే ఉండి కరోనా తీవ్రత ఎక్కువై చనిపోతున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో చాలా మంది సెలబ్రెటీలు ఇంటికే పరిమితం అయ్యారు.  ఇక స్టార్ క్రికెటర్లో టిక్ టాక్ వీడియోలతో దుమ్మురేపుతున్నారు.

 

ఇప్పటికే అల్లు అర్జున్ 'బుట్ట బొమ్మ' పాటకు స్టెప్పులేసి అదరగొట్టిన ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ తాజాగా మరో సౌతిండియా పాటకు తనదైన శైలి హావభావాలతో కూడిన స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. తాజాగా ఒకప్పుడు యాక్షన్ హీరో అర్జున్ నటించిన ‘జెంటిల్ మేన్’ చిత్రంలో కొంటెగాన్ని కట్టుకో కొంగు కేసి చుట్టుకో అనే సూపర్ హిట్ సాంగ్ కి కెవిన్ పీట‌ర్స‌న్  చిత్ర విచిత్రమైన హావభావాలు పెట్టి డ్యాన్స్ చేశాడు. గ్గజ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ కూడా ఫిదా అయిపోయారు. పీట‌ర్స‌న్ చేసిన కొంటెగాణ్ణి ప‌ట్టుకో (ఒట్టగత్తి కట్టికో) పాటను ఏఆర్ రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు.  ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @arrahman on

మరింత సమాచారం తెలుసుకోండి: