టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రెడ్. మాళవిక శర్మ, అక్షర గౌడ, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తుండగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి కెరీర్ పరంగా మళ్ళి ఫామ్ లోకి వచ్చిన రామ్, ఆ తరువాత కొంత అలోచించి రెడ్ సినిమా చేయాడానికి సిద్ధం అయ్యారు. వాస్తవానికి ఇది డైరెక్ట్ తెలుగు సినిమా కాదు, ఇటీవల తమిళ్ లో యువ నటుడు అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన తడం కు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ రెడ్ మూవీ లో తొలిసారిగా రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. 

IHG

మంచి ఆకట్టుకునే కథాంశంతో సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ పోషిస్తున్న రెండు పాత్రలు వేటికవే ఎంతో అద్భుతంగా ఉంటాయని, అలానే ఆ రెండు రకాల పాత్రల్లో రామ్ కనబరిచిన నటన ఎంతో బాగుంటుందని అంటోంది సినిమా యూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కంపోజ్ చేసిన నువ్వే నువ్వే అనే సాంగ్ లిరికల్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందన రాబట్టగా, అంతకముందు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఎంతో ఆకట్టుకుంది. 

 

ఇకపోతే నేడు ఏకంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని గొప్ప రికార్డు ని సొంతం చేసుకుంది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై ప్రేక్షకుల్లో, రామ్ అభిమానుల్లో అప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. ఇక తమ సినిమా టీజర్ కు ఇంతగొప్ప రెస్పాన్స్ వస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని రెడ్ మూవీ యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి ఈపాటికే రిలీజ్ కావలసిన ఈ సినిమా, లాక్ డౌన్ వలన షూటింగ్ ఆగిపోవడంతో, ఈ లాక్ డౌన్ ముగిసిన అనంతరం మిగతా షూటింగ్ పూర్తి చేసి దసరా కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: