జూనియర్ ఎన్టీఆర్... మన తెలుగులో ఈ పేరు వినగానే చాలా మందికి నటన ఒక్కటే గుర్తుకు వస్తుంది. ఏ సినిమా అయినా ఎలాంటి సినిమా అయినా సరే తారక్ నటన సినిమాలో హైలెట్ గా నిలుస్తూ ఉంటుంది అగ్ర హీరోల సినిమాల్లో ఈ తరం లో ఆ స్తాయిలో నటించే నటుడు మరొకరు... లేరు అనేది వాస్తవం. ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల‌లో అటు పౌరాణి కం క‌థ‌ల‌లో కాని.. అటు సాంఘీక క‌థ‌ల‌లో కాని ఎన్టీఆర్‌ను మించిన న‌టుడు మ‌రొక‌రు లేర‌నే చెప్పాలి. ప్రస్తుతం తారక్ ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు.

 

సినిమా తర్వాత అతను ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఆ సినిమా తర్వాత బన్సాలి తో ఒక పీరియాడికల్ డ్రామాలో నటించడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాలో తారక్ గుండు తో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో తాను గుండు తో నటిస్తా అని చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంద‌ని స‌మాచారం.

 

సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది తెలియకపోయినా తారక్ నటన మాత్రం సినిమాలో హైలెట్ అని అతను ఈ సినిమాలో భారీగా కనపడత్ఘాడు అని అంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నాడు. బన్సాలి ఈ సినిమాలో విలన్ గా రణవీర్ కపూర్ ని తీసుకునే అవకాశం ఉందని హీరోయిన్ గా కొత్త అమ్మాయిని పరిచయం చేస్తారు అని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఇది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: