మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఏ హీరో సినిమాకైనా అంచనాలు ఒకే విధంగా ఉంటాయి. ఎందుకంటే మెగాభిమానుల అండదండలు పుష్కలంగా ఆ హీరోలకు ఉంటాయి కాబట్టి. స్వంతంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నా వాళ్ల సినిమాలకు తెగే మొదటి టికెట్ సగటు మెగాస్టార్ అభిమానిదే. చిరంజీవి ఇంపాక్ట్ అలాంటిది. పవన్ కల్యాణ్ నుంచి అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వరకూ అందరికి ఇదే వర్తిస్తుంది. వీరిలో కొణిదెల ఇంటి రెండో వారసుడు వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ సక్సెస్ లు సాధిస్తున్నాడు ఈ హీరో.

 

 

ప్రీవియస్ గా గద్దలకొండ గణేశ్ తో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి అనే దర్శకుడు తన తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేస్తున్నా.. వరుణ్ నమ్మకముంచాడు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం వరుణ్ బాక్సింగ్ లో మెళకువలు నేర్చుకున్నాడు. అమెరికా వెళ్లి మరీ కష్టపడ్డాడు. బాడీ ఫిట్ సాధించి ఒరిజినల్ బాక్సర్ గా మారిపోయాడు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో బాడీ ఫిట్ నెస్ కాపాడుకోవాల్సిన పరిస్థితి. వరుణ్ ఇందులో ఏమాత్రం తగ్గడం లేదు.

 

 

కష్టపడి సాధించిన ఫిట్ నెస్ ను ఏమాత్రం అలక్ష్యం చేయకుండా శ్రమిస్తున్నాడు. ఇంట్లో తాను బాక్సింగ్ బ్యాగ్ హిట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. నేను అలసట పొందాను అన్నప్పుడు బాక్సింగ్ కిక్ ఇస్తూంటాను అని అంటున్నాడు. ఈ సినిమా కోసం తానెంత కష్టపడుతున్నాడో మరోసారి ఈ వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు. వరుణ్ ఫిట్ నెస్ కోల్పోతున్నాడు అని వస్తున్న విమర్శలకు ఈ వీడియోనే సమాధానం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: