బాహుబలి తర్వాత తెలుగు సినిమా రయ్ న దూసుకుపోతోంది. ఇక మన టాలీవుడ్ కు తిరుగులేదనుకునే సమయంలో కరోనా భూతం అడ్డుపడింది. కరోనా రూపంలో శని పట్టింది. తెలుగు స్టార్స్ చాలా మంది పాన్ ఇండియా మూవీస్ బాట పట్టారు. కరోనా సినిమాలన్నింటిపై పడుతున్నా.. పాన్ ఇండియా మూవీస్ ఎక్కువగా ప్రభావానికి గురవుతాయట. 

 

పాన్ ఇండియా మూవీకి బడ్జెట్ ఎక్కువైనా.. చాలా ఉపయోగాలున్నాయి. సౌత్ ఇండియాలోని అన్ని లాంగ్వేజస్ తో పాటు.. హిందీలో డబ్ చేయడంతో హీరోల మార్కట్ పెరుగుతుంది. అన్ని భాషల శాటిలైట్.. డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతకు అదనపు ఆదాయం వస్తుంది. క్వాలిటీ కోసం.. బడ్జెట్ పెంచుకునే అవకాశముంది. ఓవరాల్ గా తెలుగు సినిమా.. ఇండియా మొత్తం వెలిగిపోయే అవకాశముంది. 

 

బాహుబలి అద్భుత విజయం తర్వాత తెలుగు స్టార్స్ అందరూ పాన్ ఇండియా మార్కట్ వైపు దృష్టిపెట్టారు. బాహుబలి తీసుకొచ్చిన స్టార్ డమ్ తో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ తప్ప మరో మూవీ చేయడం లేదు. నాగ అశ్విన్ దర్శకత్వంలో ఏకంగా పాన్ వరల్డ్ మూవీలో అడుగుపెడుతున్నాడు. బాహుబలి 2తర్వాత రిలీజైన సాహో నిరాశపరిచింది. హిందీలో ఆడియెన్స్ మెప్పించినా.. మిగిలిన అన్ని భాషల్లో ప్లాప్ అయింది. ఈ రిజల్ట్ తో బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గాడు ప్రభాస్. జార్జియాలో షూటింగ్ జరుపుకొని కరోనా కారణంగా మధ్యలో వచ్చేశారు. బ్యాలన్స్ షూటింగ్ ను మళ్లీ అక్కడే తీయాలంటే అనుమతులు ఎపుడు వస్తాయో తెలియని పరిస్థితి. 

 

త్వరలో ప్రభాస్ ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా వైపు వెళ్తుంటే..నేను సైతం అంటూ.. బన్నీ కూడా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న పుష్ప సినిమాతో అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ మార్కెట్ కు చేరువకావడం కోసం.. ఐటమ్ గార్ల్ గా దిశాపటానీ పేరు పరిశీలించారు. ఈ సాంగ్ కోసం కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకునే అవకాశముంది. ఇందులో సగం ఇచ్చే వేరే అమ్మడిని తీసుకుంటారట. 
ఆర్ఆర్ఆర్ 80శాతం షూటింగ్ పూర్తయింది. ఈ బ్యాలెన్స్ వర్క్ లో బడ్జెట్ తగ్గించుకునేది ఏమీ ఉండదు. ప్రభాస్ మూవీ జాన్ బడ్జెట్ కంట్రోల్ పై మల్లగుల్లాలు పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: