దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ ఇవ్వడం మనకందరికీ తెలిసిందే. బాలీవుడ్ ‘పింక్’ సినిమాను ‘వకీల్ సాబ్’ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు సగం పైగా పూర్తయింది. వాస్తవానికి ఈ కరోనా వైరస్ లాక్ డౌన్ ఉండకపోతే మే నెలలో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉండాల్సింది. అయితే సినిమాకి సంబంధించి కొంత బ్యాలెన్స్ షూటింగ్ ఉండటంతో పాటు సినిమా థియేటర్ల విషయంలో ప్రభుత్వాలు ఇంక నిర్ణయాలు తీసుకోక పోవడంతో ‘వకీల్ సాబ్’ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అయితే ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం ప్రకారం వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు టాక్.

 

ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో మొగలు కాలం నాటికి చెందిన పవన్సినిమా చేస్తుండగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా ఓకే చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మరికొన్ని సినిమాలు పవన్ లైన్ లో పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళం ఇండస్ట్రీలో సూపర్ హిట్ మూవీ 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా తెలుగులో రీమేక్ పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ పవన్ పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

సినిమా క్యారెక్టర్ కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి సూట్ అవుతుందని చాలా మంది డైరెక్టర్లు కూడా అంటున్నారు. మొన్నటి వరకు 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమాకి సంబంధించి తెలుగు రీమేక్ లో ఆ  హీరోగా నటించబోతున్నాడు, ఈ హీరో నటించబోతున్నాడు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వచ్చాయి. అయితే చివరాఖరికి ఈ సినిమా పవన్ వద్దకు వెళ్లినట్లు తాజాగా సరికొత్త వార్తలు వినబడుతున్నాయి. మలయాళంలో ఈ సినిమా మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కడం జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: