రానా ద‌గ్గుబాటి.. గ‌త కొన్ని గంట‌లుగా ఈయ‌న పేరు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు కార‌ణంగా.. స‌డెన్‌గా రానా.. త‌న ప్రేమని, ప్రేయ‌సిని బ‌య‌ట పెట్ట‌డ‌మే. ఈ క్ర‌మంలోనే అతి త్వ‌ర‌లో రానా కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మిహీకా బజాజ్ అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. ఈ విషయాన్ని రానా నిన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన వెంటనే... ఈ విషయం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. వాస్త‌వానికి చాలా కాలంగా టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న మ్యాన్లీ హంక్ రానాకు పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురౌతునే ఉంది. 

IHG

అయితే ఆ ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు చెక్ ప‌డింది. నిన్న తనకు కాబోయే భార్య మిహీకా బజాజ్ గురించి చెప్పి అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అంతేకాదు ఆమె తనకు ఓకె చెప్పిందంటూ ఆమెతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో రానాకు సోషల్ మీడియలో శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 

IHG

ఇక గత కొన్ని రోజులుగా రానా ప్రేమ వ్యవహారంపై పూటకో వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. వాటన్నింటికీ పులిస్టాప్ పెడుతూ.. తాజాగా తన ప్రేమిస్తోంది ఎవరినో ఎలాంటి మొహమాటం లేకుండా అందరికీ పరిచయం చేసాడు.  వీళ్లిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు అంగీకరించినట్టు ఉంది.  ఈ క్ర‌మంలోనే 2020 డిసెంబర్‌లో వాళ్ల పెళ్ళి జరపాలని భావిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసాడు సురేష్ బాబు. 

IHG

పరిస్థితులు అనుకూలిస్తే ఇంకొంచెం త్వరగా కూడా జరిపే అవకాశం ఉందని చెప్పాడు ఈయన.  రానా ప్రేమించే మిహికా బజాజ్ వారిది హైదరాబాదే అని చెబుతున్నారు. ప్రస్తుతం మిహికా ముంబైలోని డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను రన్ చేస్తోంది. ప్ర‌స్తుతం మిహికా బజాజ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వాటిపై మీరు లుక్కేసేయండి.

IHG

 

IHG

 

IHG

 

IHG

 

IHG

 

IHG


 

మరింత సమాచారం తెలుసుకోండి: