సినిమాల్లోని సన్నివేశాలు, పాటలు, డైలాగులు ఎంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే అవి అంతగా పాపులర్ అవుతాయి. గతంలో పాటలను హమ్మింగ్ చేయడం, ఇంట్లోనే తమ టాలెంట్ ను ప్రదర్శించడం చేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో తమ టాలెంట్ ను అందరికీ చేరువ చేస్తున్నారు. అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమా పాటలు సృష్టించిన సంచలనం తెలిసిందే. ఇప్పుడు క్రికెటర్ల పుణ్యమా అని దేశాలు, ఖండాలు దాటి ఆ పాటలకు ప్రజాదరణ వస్తోంది. బుట్టబొమ్మ, రాములో రాములా పాటలకు, పోకిరి సినిమాలోని డైలాగ్ ను వార్నర్ టిక్ టాక్ చేసి సంచలనం రేపాడు.

 

 

దీనికి అల్లు అర్జున్, పూరి జగన్నాధ్.. తమ తమ అప్రిషియేషన్స్ ఇస్తున్నారు. తమ అభిమాన హీరో పాటలు, సన్నివేశాలు వార్నర్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. వార్నర్ లో రొమాంటిక్ యాంగిల్, సీరియస్ యాంగిల్ చూసిన బన్నీ, మహేశ్ అభిమానులు ఇప్పుడు వార్నర్ హీరోని చేసి సినిమా తీస్తే బాగుంటుందని పోస్టులు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా వార్నర్ ను హీరోయిక్ పోస్టర్ లో ఎడిట్ చేసి మరీ వదులుతున్నారు. దీనికి దర్శకుడు పూరి జగన్నాధ్ అని పేరు కూడా వేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి.

IHG

 

క్రియేటివిటీ చూపించడంలో మన సినీ అభిమానుల సంగతి తెలిసిందే కదా. అదే తరహాలో డేవిడ్ వార్నర్ ఫోటోను చాలా సీరియస్ లుక్ లో డిజైన్ చేశారు. వార్నర్ కూడా తెలుగు సినిమా పాటల్ని, సన్నివేశాల్ని వదలటం లేదు. తెలుగు సినిమాలు చూడాలని కూడా మొన్నామధ్య రోహిత్ శర్మతో వీడియో కాల్ లో చెప్పుకొచ్చాడు. దీంతో వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయాడు. అల.. వైకుంఠపురములో పాటలు తనకు బాగా నచ్చాయని వార్నర్ చెప్పడం విశేషంగా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: