టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్మ్ పోతినేని కి ఒక సపరేట్ ఇమేజ్ ఉంది. మొదటి సినిమా దేవదాస్ సినిమా నుండి డాన్స్ అండ్ యాక్టింగ్ లో తనకంటూ ఒక కొత్త పంథాని ఏర్పరచుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో రామ్మ్ మినిమం గ్యారెంటీ హీరోగా క్రేజ్ ని దక్కించుకున్నాడు. అంతేకాదు క్లాస్ అండ్ మాస్ హీరో ఇమేజ్ ని బాగా దక్కించుకున్నాడు. నేను శైలజ వంటి క్లాస్ సినిమా అలాగే ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ కాన్సెప్ట్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ని సాధిస్తున్నాడు.

 

ఇక ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ హీరో లేటెస్ట్ మూవీ రెడ్. తమిళంలో సూపర్ హిట్ అయిన తడం సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మించారు. రామ్ కి ఇప్పటి వరకు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ సినిమాని తెరకెక్కించాడు.

 

నివేదా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ గెస్ట్ రోల్ లో కనిపిస్తోంది. అయితే మరోసారి మాస్ క్యారెక్టర్ లో రామ్ సెన్షేషనల్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో సినిమా మీద భారీ అంచనాలు క్రియోట్ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ 10మిలియన్ వ్యూస్ సాధించి సెన్షేషన్ ని సృష్ఠించింది.

 

ఇక మరోసారి మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ తో సినిమాని సూపర్ హిట్ అయ్యోలా తాపత్రయపడుతున్నాడు. ఇక అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. లాక్ డౌన్ విరమించగానే పరిస్థితులని బట్టి జూలై లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అంతేకాదు డ్యూయల్ రోల్ లో నటించిన రామ్మ్ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టి ఇస్మార్ట్ శంకర్ మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: