కొంతమంది పాలకులు  తమ పాలనతో  చరిత్ర సృష్టిస్తూ  ఉంటారు. ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్రమోదీ భారత్ లో  అదే చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది పాలించారు.. కానీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రతి అడుగులో చరిత్రలో ఒక అధ్యాయాన్ని లెక్కిస్తున్నారు. ఒక పర్యాయం లో చరిత్ర సృష్టించి రెండవ పర్యాయం లో కూడా అధికారంలోకి వచ్చి మరోసారి తన మార్కు పాలనతో  దూసుకుపోతున్నారు ప్రధాని నరేంద్ర మోది. 

 

 ఇప్పుడు వరకు నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్ని ఒక చరిత్రను సృష్టించాయి  అని చెప్పాలి. అయితే తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 21వ శతాబ్దం మనదే అంటూ దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు.  ప్రస్తుతం దీనిపై  విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు పాలించిన పాలకులు  అందరూ పేదరికంలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందించటం  మూడుపూటలా ఆహారం దొరికేలా ప్రభుత్వం అందించడం లాంటివి చేసి ప్రజలను సోమరిగా మార్చింది అని.. తమకు ఉద్యోగ కల్పన కల్పించి తమ తిండి తము సంపాదించుకునే స్థితి మాత్రం కల్పించలేక పోయారు  అని విశ్లేషకులు అంటున్నారు. 

 

 కానీ ప్రస్తుతం నరేంద్ర మోడీ మాత్రం.. 21వ శతాబ్దపు భారత్ దే  అంటూ ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో యువ శక్తి ఎక్కువగా.. దేశంలోనే అత్యధిక యువ శక్తి గల దేశంగా భారతదేశం ఉంది.. భూమి కూడా ఉంది.... సాంకేతిక వనరులు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు కావాల్సినది  పెట్టుబడి మాత్రం. ఆ పెట్టుబడి కి సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది అని అంటున్నారు విశ్లేషకులు.  అందుకే దేశ ప్రధాని నరేంద్ర మోడీ 21వ శతాబ్దం భారత్ దే  అంటూ వ్యాఖ్యానించారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: