స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాస్త గ్యాప్ తీసుకుని తీస్తున్న సినిమా 'పుష్ప'. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'పుష్ప' పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమైపోతుంది. రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడనిపిస్తుంది. దీని కోసం అల్లు అర్జున్ ఇప్పటికే శిక్షణ కూడా పొందుతున్నాడు. అంతేకాకుండా సుకుమార్ - రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' ఛాయలు కూడా 'పుష్ప'లో కనిపిస్తున్నాయి. శేషాచ‌లం అడ‌వుల్లో గంధపు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

 

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. అయితే అల్లు అర్జున్సినిమా కోసం ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నాడట. 'రౌద్రం రణం రుధిరం' (ఆర్.ఆర్.ఆర్) సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. తారక్ ఒక్క మలయాళం మినహా మిగతా అన్ని భాషల్లోనూ తానే డబ్బింగ్ చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే లాక్ డౌన్ లో ఆ భాషలపై పట్టు సాధించడానికి ఎన్టీఆర్ గట్టిగానే ట్రై చేస్తున్నాడట. దీనితో ఈ అంశం అభిమానుల్లో మంచి హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు అదే బాటలో అల్లు అర్జున్ కూడా నడవబోతున్నాడట. 'పుష్ప' పై కూడా నార్త్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఎలాగూ సౌత్ ఇండస్ట్రీలో ఆల్రెడీ బన్నీకి మంచి మార్కెట్ ఉంది. దీంతో తాను కూడా ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్తే మరింత ఇంపాక్ట్ ఉంటుందని బన్నీ ఆలోచిస్తున్నాడట. మరి బన్నీ కూడా తారక్ లాంటి స్టెప్ తీసుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: