గత మంగళ వారం నుండి లాక్ డౌన్ నిబంధనలు మరింత సరళతరం చేస్తూ కేంద్రప్రభుత్వం రైళ్ళ ప్రయాణాలకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున శ్రామిక్ స్పెషల్స్ తిరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు వేల సంఖ్యలో జనం ఈ రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నారు. 


దీనికితోడు ఈ నెల 18 తారీఖు తరువాత దేశవ్యాప్తంగా 4వ సారి లాక్ డౌన్ పొడిగిస్తున్న నేపధ్యంలో ఈ లాక్ డౌన్ పరిస్థితులలో కూడ నిబంధనలను మరింత సరళతరం చేస్తూ దేశ ఆర్ధిక వ్యవస్థను అదేవిధంగా దేశంలోని వ్యాపారాలను ఒక గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్ల యజమానుల దృష్టి వరకు రావడంతో వారు ఈ విషయం పై విభిన్నంగా స్పందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


ప్రస్తుతం నడుస్తున్న రైళ్లల్లో చాల ఎసి రైళ్ళు కూడా ఉన్నాయి. ఎసి లో ఎక్కువ సేపు ఉంటే కరోనా త్వరగా వ్యాప్తి చెందుతుంది అంటూ టీవీ ఛాన‌ళ్లు ఈ విషయంలో జ‌నాల‌ను బెద‌ర‌గొట్టే వార్తలను ఇప్పటికే ప్రసారం చేసాయి. దీనితో జనం ఏసీ లలో గడపడానికి భయపడిపోతున్నారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుతం నడుస్తున్న చాల రైళ్లల్లో ఏసీ భోగీలు కూడ ఉండటంతో వాటిలో కూడ జనం విపరీతంగా ప్రయాణాలు చేస్తున్నారు. 


దీనితో ప్రభుత్వాలు భౌతిక దూరం పాటిస్తూ జనంతో ఏకంగా 24 గంటలు ప్రయాణం కొనసాగించే రైళ్ళను అనుమతించినప్పుడు కేవలం రెండున్నర గంటలు మాత్రమే ప్రేక్షకులను అదేవిధంగా భౌతిక దూరం పాటిస్తూ ప్రేక్షకులను తమ వద్ద ఉంచుకోవడానికి ధియేటర్లకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు అంటూ అనేకమంది ధియేటర్స్ ఓనర్స్ మధన పడుతున్నట్లు టాక్. ఈ విషయం పై మరికొందరు వేరే విధంగా స్పందిస్తున్నారు. రైళ్ళ టిక్కెట్స్ వలన వచ్చే ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది కానీ సినిమా టిక్కెట్ల పై వచ్చే వినోదపు పన్ను రాష్ట్రాలకు చెందే విషయంకావడంతో కేంద్ర ప్రభుత్వం దృష్టిలో సినిమా ధియేటర్లు సినిమా షూటింగ్ లు మినహాయింపులకు సంబంధించిన చివరి లిస్టులోనే ఉంటాయి అంటూ కొందరి విశ్లేషకుల అభిప్రాయం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: