పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం పోకిరి. టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా ఇది. అప్పటి వరకు టాలీవుడ్ ఒకటి అక్కడి నుంచి టాలీవుడ్ ఒకటి అనే విధంగా ఈ సినిమా ఎన్నో సంచలనాలను నమోదు చేసింది అనేది వాస్తవం మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా ఒక సంచలనం అని చెప్తూ ఉంటారు. అప్పటి వరకు కొంత వరకే పరిమితం అయిన మహేష్ బాబు కెరీర్ అక్కడి నుంచి చాలా వేగంగా మారింది అనేది వాస్తవం. ఇక అతని తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఎదురు చూసారు. 

 

ఇక అది పక్కన పెడితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కొన్ని పాటలు అన్నీ కూడా ఒక సంచలనమే. ప్రధానంగా ఈ సినిమాలో ఉండే ఐటెం సాంగ్ ఇప్పటికి కూడా వినపడుతూనే ఉంటుంది. ఇప్పటికింకా నా వయసు నిండా పద హారే అనే పాట టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది అనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ పాటలో ముమైత్ ఖాన్ వేసిన డాన్స్ చూసి టాలీవుడ్ జనాలకు ఒకరకంగా పిచ్చి ఎక్కింది అనే చెప్పవచ్చు. ఆ విధంగా ఈ సినిమాలో పాట హిట్ అయింది. టాలీవుడ్ జనాలకు ఐటెం సాంగ్స్ కొత్త కాదు గాని ఈ సినిమా మాత్రం కొత్తగానే చూపించింది. 

 

పూరి జగన్నాథ్ తీసిన విధానం తో పాటుగా ఈ పాట లిరిక్స్ కూడా ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చ. ఈ సినిమా తర్వాత ముమైత్ ఖాన్ కి డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఆమె కోసం టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఆ విధంగా ఈ పాట హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: