తెలుగులో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆ సినిమాల్లో ఉండే పాటలను మాత్రం ప్రేక్షకులు ఎప్పటికి వింటూ ఉంటారు అనేది వాస్తవం. పాటలకు మన తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది అనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాట హిట్ అవ్వాలి అంటే సినిమా హిట్ కి ఏ మాత్రం కూడా సంబంధం లేదు అనేది వాస్తవం. మన టాలీవుడ్ జనాలకు పాటలు కూడా చాలా బాగా దగ్గరవుతూ ఉంటాయి. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో ప్రత్యేకంగా పాటలకే ప్రాధాన్యత ఇచ్చే వారు దర్శక నిర్మాతలు అనేది వాస్తవం. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమాలు పవన్ కళ్యాణ్. ఆయన కమర్షియల్ హీరో కాబట్టి కమర్షియల్ గానే ఆలోచించే దర్శక నిర్మాతలు ఆయన సినిమాల్లో కమర్షియల్ గా ఉండే సాంగ్స్ ని ఎక్కువగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన కెరీర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చాలా పెద్ద ఫ్లాప్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఉన్న ఒక పాట టాలీవుడ్ ని ఊపేసింది. రాయ్ లక్ష్మీ డాన్స్ చేసిన తప్పు తప్పే సుద్ద తప్పే అనే పాట టాలీవుడ్ కి కొత్తదనం పరిచయం చేసింది అంటూ ఉంటారు. ఈ సినిమాలో అన్ని పాటలు దాదాపుగా హిట్ అయ్యాయి. 

 

అయితే ఆ పాట  మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా చాలా బాగా దగ్గర అయింది అనేది వాస్తవం. సినిమా ఫ్లాప్ అయినా సరే ఈ సినిమాలో ఈ పాటకు చాలా ప్రాధాన్యత ఇవ్వడమే కాదు యుట్యూబ్ లో కూడా ఈ పాట ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ పాట టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ అంటారు. ఈ పాటలో రాయ్ లక్ష్మి డాన్స్ కూడా ప్రేక్షకులకు నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: