లాక్ డౌన్ దెబ్బతో ఏకంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా 3 నెలలు కంప్లీట్ గా మిస్ అయ్యిపోయింది. మూడు నెలలు సినిమాల్లేక, షూటింగుల్లేక, బిజినెస్ లేక .. క్వార్టర్ ఇయర్ మొత్తం కరోనా దెబ్బకు బలైపోయి మొత్తం ఇండస్ట్రీ  కనపడకుండాపోయింది. 

 

లాక్ డౌన్  చూస్తుండగానే రెండు నెలలుకంప్లీట్ అవుతోంది. ఇంకో నెల ఈజీగా కంటిన్యూ అవ్వచ్చు. స్పెషల్లీ లాక్ డౌన్ కంటిన్యూ అయినా అవ్వకపోయినా సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఇంకో నెల శూన్యమాసమే . ఇప్పటికే అన్ని సినిమాలు షెడ్యూల్స్ మార్చుకుని రీషెడ్యూల్ చేసుకుని షూటింగులన్నీ పోస్ట్ పోన్ చేసేసుకున్నాయి. మినిమం ఇంకో నెల రోజులు సినిమాలకు సంబందించి అంటే జూన్ వరకూ షూటింగులు, రిలీజ్ లు, బిజినెస్లు..ఇలా ఎటువంటి యాక్టివిటీస్ జరిగే ఛాన్స్ లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

 

ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడునెలలు అంటే ఓ సీజన్.. సంవత్సరంలో ఓ క్వార్టర్ పీరియడ్.. కంప్లీట్ గా కనుమరుగైపోయింది. సినిమాలకు వన్  ఆఫ్ ద బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మర్  సీజన్ మొత్తం మిస్ అయ్యిపోయింది. సంవత్సరంలో మూడు నెలలు మిస్ అవ్వడంతో దాదాపు 600కోట్ల బిజినెస్ మిస్ అయ్యినట్టు చెబుతున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.  ఈ సీజన్ లో చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా సినిమాలు రిలీజ్ కు పెట్టుకున్నారు చాలా మంది హీరోలు . అసలు తమ సినిమాలు ముందే రెడీ అయిపోయినా ..సమ్మర్ కే వద్దామని పోస్ట్ పోన్ చేసుకున్నారు  అనుష్క లాంటి టాప్ హీరోయిన్లు . ఇలా దాదాపు 20 సినిమాలు సమ్మర్ కోసం వెయిట్ చేసి మొత్తానికి దెబ్బైపోయాయి.

 

ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాలు నిర్మిస్తున్నది టాలీవుడ్ లోనే. అయితే ఇందులో ఇప్పటికే జాన్, ఫైటర్ , ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. కొన్ని సినిమాలు స్టార్టింగ్ దశలో ఉన్నాయి.. ఇప్పుడు ఈ సినిమాల బడ్జెట్ లపై భారం పెరిగే అవకాశం ఉంది. సినిమాలకు ఇచ్చిన బడ్జెట్ తగ్గించలేక, ఇంకా పెట్టుబడి పెట్టలేక నిర్మాతలకు  ఈ లాక్ డౌన్ కష్టకాలమే మిగిల్చేలా కనిపిస్తోంది. 

 

ఈసారి చిన్నాపెద్దా కలిపి దాదాపు 40 సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1800 థియేటర్లలో  వారానికి ఒక్కో థియేటర్‌కు దాదాపు  3లక్షలు మినిమం లాస్ వస్తోంది. ఈ సమ్మర్ సీజన్ లో నిజానికి ఈ లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నష్టాలను పూడ్చడానికి చాలా టైమ్ పడుతుందంటున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: