35 సంవత్సరాలుగా ఒక కమెడియన్ టాప్ కమెడియన్ హోదాలో కొనసాగుతూ 1000కు పైగా సినిమాలలో నటించడమే కాకుండా గిన్నీస్ బుక్ లో స్థానం పొందడం అంత సులువైన పనికాదు. రేలంగి అల్లు రామలింగయ్యల తరువాత తెలుగు సినిమా రంగచరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి బ్రహ్మి. 


ఇలాంటి గొప్పవ్యక్తి డబ్బుకు సంబంధించిన విషయాలలోనూ అదేవిధంగా తన పారితోషిక విషయంలోనూ చాలఖచ్చితంగా ఉంటాడు అంటూ అనేకసార్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు బ్రహ్మానందం తలపై దువ్వుకోవడానికి పెద్దగా జుత్తు లేకపోయినా సినిమా షూటింగ్ లకు వచ్చేడప్పుడు ఒక హెయిర్ డ్రెసర్ చార్జీలను నిర్మాతల నుండి వసూలు చేస్తాడు అంటూ అనేకసార్లు రూమర్లు కూడ వచ్చాయి.


ఇప్పుడు ఆ వార్తలు అన్నింటి పైనా బ్రహ్మానందం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను డబ్బు విషయంలో చాల ఖచ్చితంగా ఉంటాను అన్న విషయం నిజం అని చెపుతూ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి చివరిదశలో ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డ ఎందరో ప్రముఖుల జీవితాలను చూసి తాను ఇలా కఠినంగా మారిపోయాను అని అంటున్నాడు. అయితే డబ్బు విషయంలో తాను ఎంత ఖచ్చితంగా ఉన్నా తనకు వచ్చే వంద రూపాయల సంపాదనలో 10 రూపాయలు దానాలు ఇస్తాను అన్న విషయం చాలామందికి తెలియదు అంటూ కామెంట్ చేసాడు. 


అంతేకాదు తాను ఇప్పటి వరకు 23 జంటలకు తన ఖర్చులతో పెళ్ళిళ్ళు చేసి వాళ్లకు అన్నీ సమకూర్చిన విషయాలు కూడ చాలామందికి తెలియదు అనీ అనవసరమైన పబ్లిసిటీ తనకు నచ్చదు అని అంటున్నాడు. ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి నవ్వించి మెప్పించిన బ్రహ్మానందం కృష్ణవంశీ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రంగమార్తాండ’ మూవీలో అత్యంత కీలకమైన విషాద పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా విడుదల అయిన తరువాత బ్రహ్మీ నవ్వించడమే కాదు ఎద్పించడం కూడ ఇంత బాగా చేయగలడా అన్న ప్రశంసలు కూడ వస్తాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: