దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ రికార్డ్. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్ లాంటి ఎన్నో ఆకట్టుకునే డైలాగులతో తెరకెక్కిన దూకుడు సినిమా 2011 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మొట్టమొదటిగా సమంత నటించగా... వారి కెమిస్ట్రీ వెండితెరపై అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ చిత్రంలోని పాటలు కూడా అందరి నోట సంవత్సరాల తరబడి నానాయి అంటే అతిశయోక్తి కాదు. శంకర్ మహదేవన్ పాడిన దూకుడు టైటిల్ సాంగ్ నీ దూకుడు సాటెవ్వడు అప్పట్లో యూట్యూబ్ లో రికార్డులను తిరగరాసింది అని చెప్పుకోవచ్చు.


ఎస్.ఎస్.తమన్ దూకుడు సినిమా ద్వారానే తన టాలెంట్ ని అందరికీ తెలియపరిచాడు. గురువారం మార్చి ఒకటి అనే పాట విపరీతంగా ట్రెండ్ కాగా... ఆ క్రెడిట్ మొత్తం సంగీత దర్శకుడైన ఎస్.ఎస్.తమన్ కు, గాయకుడైన రాహుల్ నంబియార్ కు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. రామకృష్ణ శాస్త్రి రచనలు రూపుదిద్దుకున్న 'హే ఛుల్బులి నా ఛుల్బులి నువు కోహినూరు లాంటి కొండమల్లి' పాటకి కొత్త సంగీత బాణీలను అందించి ఆ పాట శ్రోతల మనసులను తాకేలా చేశాడు తమన్.


ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్. పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు పీ పీ పీ నొక్కేత్తాడు స్కూటర్ సుబ్బారావు అనే ఊర మాస్ పాటలో పార్వతి మెల్టన్ మహేష్ బాబు సరసన శృంగారభరిత నృత్యాలను చేసి మాస్ ఆడియన్స్ లకు కనులవిందు అయింది. ఈ పాట మొత్తం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించబడింది. వాస్తవానికి పార్వతీ మెల్టన్ కి ఖలేజా సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది కాని చివరలో అనుష్క శెట్టి ఆ ఆఫర్ను చేజిక్కించుకుంది. ఈ ఇండో అమెరికన్ ముద్దుగుమ్మ మహేష్ బాబు అంటే బాగా ఇష్టపడుతుంది. అందుకే దూకుడులో ఐటమ్ సాంగ్ చేసేందుకు అంగీకరించి తన అందాలను తెగ ఆరబోసింది.


ఈ పాటను కన్నడ తమిళ సింగర్ రమ్య పాడగా... నవీన్ మాధవ్ మహేష్ బాబు లైన్స్ పాడాడు. ఎస్.ఎస్.తమన్ సింగర్ రమ్య తో చాలా చక్కగా పాడించాడు. నిజానికి ఈ పాట మెహబూబా మెహబూబా అనే బాలీవుడ్ సాంగ్ నుండి కాపీ కొట్టి బడింది. అయినా ఈ పాట తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఇకపోతే ఈ చిత్రం కూడా 2003వ సంవత్సరంలో జర్మనీ భాష లో విడుదలైన గుడ్ బాయ్ లెనిన్ నుండి స్ఫూర్తిగా తీసుకొనబడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: