సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే హీరో హీరోయిన్లు ఎంత యాక్షన్ చేసిన ఎంత రొమాన్స్ చేసిన ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ లేకపోతే మాత్రం ప్రేక్షకులకు ఏదో మిస్ అయిన  ఫీలింగ్ వస్తుంది. ఐటెం సాంగ్ పెడితే అటు సినిమాకు కూడా బాగా కలిసొస్తోంది. అందుకే బాగా క్రేజ్ ఉన్న నటీమణులతో దర్శకనిర్మాతలు ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తూ ఉంటారు. దాదాపుగా ప్రస్తుతం అన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ ఉంటున్నాయి. ఐటెం సాంగ్ లో తన అందాల ఆరబోతతో వైపు తమ అదిరిపోయే డాన్స్ లతో మరోవైపు ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తూ ఉంటారు హీరోయిన్లు. 

 

 

 అయితే మామూలుగా అయితే ఒక స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే అదిరిపోతుంది. అయితే అందరికీ శృంగార దేవతగా అందాల ముద్దుగుమ్మ గా  ఉన్న సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ చేస్తే ఇంకా ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం సన్నీలియోన్ అందాలతోనే ఐటెం సాంగ్  హిట్ అయి పోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక చిన్న సినిమాకి సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ ఎంతో ప్లస్ పాయింట్ గా మారి ఆ సినిమా విజయానికి సాంగ్ కూడా ఒక కారణం అయింది అని చెప్పవచ్చు. ఇంతకీ ఆ చిన్న సినిమా ఏది అనుకొంటున్నారా. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన పిఎస్ఎల్వి గరుడవేగ. 

 

 

 రాజశేఖర్ పోలీస్ పాత్రలో నటించిన ఈ సినిమాలో సన్నీ లియోన్ డియో డియో డిస్క్ డిస్క్ అంటూ ఒక ఐటమ్సాంగ్ చేసి ప్రేక్షకుల మతి పోగొట్టింది. కేవలం సన్నీలియోన్ చేసిన ఐటమ్ సాంగ్ గురించి కూడా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ ఎంతలా ప్రేక్షకులను ప్రభావితం చేస్తుంది అని. తన అందాల ఆరబోతతో పాటు తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా అదరగొట్టి  ఎంతో మంది అభిమానులను ఆకర్షించింది సన్నీ లియోన్. ఈ పాట సినిమా విడుదలైన చాలా రోజుల వరకూ ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: