ఏదైనా సినిమా వచ్చిందంటే ప్రేక్షకులకు ఆ సినిమా నుంచి ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రేక్షకులందరూ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఒక మంచి ఐటెం సాంగ్ గురించి. ఈ మధ్య కాలంలో సినిమాలలో ఐటెం సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి అని చెప్పాలి. స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ చేసి మరింత క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అటు ప్రేక్షకులు కూడా సినిమాలో ఐటమ్ సాంగ్ లేదు అంటే కాస్త హర్ట్ అవుతున్నారు కూడా. తమ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాకు కూడా కలిసి వస్తుంది కాబట్టి దర్శకనిర్మాతలు కూడా తమ తమ సినిమాలలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. 

 

 

 అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఉర్రూతలూగించిన ఐటం సాంగ్ ఏది అంటే గద్దలకొండ గణేష్ సినిమా లోని ఐటెం సాంగ్ అని చెప్పాలి. ఈ  ఐటెం సాంగ్ అన్ని విధాలుగా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక ఈ ఐటెం సాంగ్ విన్నారంటే ఎవరైనా చిందులేయ్యాల్సిందే. ఇది వినడానికే ఈ పాట అలా ఉంటే.. ఇక ఈ పాటలోని డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే అదిరిపోతుంది. మెగా హీరో వరుణ్ తేజ్  హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 

 వరుణ్ తేజ్ తనలోని నటుడిని నిరూపించుకొని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు గద్దలకొండ గణేష్ సినిమాలో . మొదటి నుంచి ఈ సినిమాకు వివాదాలు చుట్టుముట్టినప్పటికీ చివరికి ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక  ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ అయితే ఇప్పటికి విన్నారంటే ప్రేక్షకులే చిందులు వేస్తూ ఉంటారు. అంతలా ప్రేక్షకులను ప్రభావితం చేసింది ఈ ఐటమ్ సాంగ్. జర్రా జర్రా  అంటూ ఉండే ఐటమ్ సాంగ్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ లో అందాల ఆరబోత కూడా అన్ని వాటికవే సాటి అన్నట్టుగా ఉంటాయి. అందుకే ఈ  ఐటెం సాంగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: