తెలుగు చిత్ర‌ పరిశ్రమలో ఐటెం సాంగుల ఆనవాయితీ ఎన్టీఆర్ కాలం నుండీ వ‌స్తున్న‌ సంగతి తెలిసిందే. ఒకప్పుడు జయమాలిని, డిస్కో శాంతి, జ్యోతి లక్ష్మి లాంటి వాళ్లు ఇండస్ట్రీని ఐటం సాంగులతో ఓ ఊపు ఊపేశారు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ లాంటి వారు తమ హవా కొనసాగించారు. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయ‌డానికి వెనుక‌డుగు వేయడం లేదు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే..   సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100 % లవ్ సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. వాస్త‌వానికి నాగచైతన్య, తమన్నాల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీతో ఈ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక మహాలక్ష్మి పాత్రతో తమన్నా అయితే ఇటు అందం, అటు నటనతో యూత్ హృదయాలను కొల్ల‌గొట్టేసింది. అందుకే ఈ సినిమాతో అందరి కంటే ఎక్కువగా తమన్నా పేరు తెచ్చుకుంది. దర్శకుడుగా సుకుమార్ ఈ సినిమాలో విశ్వరూపం ప్రదర్శించాడని చెప్పాలి.కలవటం..విడిపోవటం..పొందటం అనే రెగ్యులర్ రొమాంటిక్ బీట్స్ కు అణుగుణంగానే సుకుమార్ ఈ సినిమాను తెర‌కెక్కించి స‌క్సెస్ అయ్యారు.


 
ఇక ఈ సినిమాకు మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.. ఐటెం సాంగ్‌. ఆ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘డియ్యాలో డియ్యాలో..’ ఐటెం సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంది. నిజానికి ఈ సినిమా అంతా క్లాస్ అయిన‌ప్ప‌టికీ.. `డియ్యాలో డియ్యాలో` పాట ఊరా మాస్ అని చెప్పుకోవాలి. ఈ పాటను విన్న ప్రతి ఒక్కరు అది పడాల్సిందే.. ఇంకోసారి చూడాల్సిందే.. వినాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఈ ఐటెం సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌లో అల‌రించింది. ఇక బెస్ట్‌ ఐటెం సాంగ్స్ లో ఈ సినిమా సాంగ్ కూడా ఒక సూపర్ హిట్ సాంగ్ లా నిలిచిపోయింది అన‌డంతో సందేహం లేదు. ఏదేమైనా డియ్యాలో.. డియ్యాలో ఐటెం సాంగ్ కేకంతే అంటారు ప్రేక్ష‌కులు.

 


 

 

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: