ఈ మధ్యకాలంలో ప్రస్తుతం ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ కామన్ గా మారిపోయింది. ఇక స్టార్ హీరో సినిమా వచ్చిందంటే అందులో ఐటెం సాంగ్ ఉండాల్సిందే. బాగా పాపులర్ అయిన నటీమణులతో ఐటెం సాంగ్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ వచ్చినప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా  ఉండే ఐటమ్ సాంగ్స్  మాత్రం కొన్నే ఉంటాయి. అవి పాత సినిమాలోనా కొత్త సినిమాలోనా అన్న విషయం పక్కన పెడితే అవి మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తునే  ఉంటాయి. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాల్లో  ఐటమ్ సాంగ్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక దర్శక ధీరుడు సినిమా అంటే ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఐటెం సాంగ్ లేకుండా దర్శకుడు ఏ సినిమా చేయడు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం చత్రపతి. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఎంతో సెన్సేషన్ విజయాన్ని అందుకుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారిగా ప్రభాస్ ని స్టార్ హీరోను చేసింది చత్రపతి సినిమా. ఆ రోజుల్లో బాగా పాపులర్ అయ్యి  ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన నటి ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. 

 

 

 సినిమా ఏదైనా హీరో ఎవరైనా ఆ సినిమాలో ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ముమైత్ ఖాన్. చత్రపతి సినిమాలో కూడా ముమైత్ ఖాన్ చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తునే  ఉంది. నీకు పంచదార పూరీలు లేవా అంటూ మొదలయ్యే ఐటమ్ సాంగ్ లో ముమైత్ ఖాన్ చేసే పర్ఫామెన్స్ ఇప్పటికి  ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ గా నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సాంగ్ ఎప్పుడొచ్చినా... చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చిందులెయ్యాల్సిందే. ఎన్నో రోజుల పాటు ట్రెండింగ్ గా మారిపోయింది ఈ పాట.

మరింత సమాచారం తెలుసుకోండి: