2012వ సంవత్సరంలో విడుదలైన డమరుకం సినిమాలో అనుష్క శెట్టి, అక్కినేని నాగార్జున హీరో హీరోయిన్ల గా నటించారు. ఈ సినిమాలో విలన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పే సాయికుమార్ సోదరుడు రవిశంకర్ అంధకాసురుడు అనే రాక్షసుడు పాత్రలో నటించి అందరిని ఫిదా చేసేసాడు. ప్రకాష్ రాజ్ లార్డ్ శివ పాత్రలో అద్భుతంగా నటించాడు అని చెప్పుకోవచ్చు. శ్రీనివాస రెడ్డి డమరుకం సినిమాకు తానే కథ రాసి దర్శకత్వం కూడా తానే వహించాడు.


దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో అందరూ రాక్షసులే చనిపోగా... అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు మాత్రం బతుకుతాడు. తమ రాక్షసులను చంపిన దేవతలపై కసి తీర్చుకోవాలని అంధకాసురుడు సరైన సమయం కోసం వేచి చూస్తుంటారు. అయితే మహేశ్వరి(అనుష్క శెట్టి) అనే అమ్మాయి ఒక అరుదైన నక్షత్ర రాశిలో జన్మించగా... ఆమెను బలిస్తే తనకి అతీతశక్తులు వస్తాయని అంధకాసురుడు ప్రయత్నిస్తుండగా... ఆమెకు అండగా మల్లికార్జున(నాగార్జున) ఉంటూ తనను కాపాడుతాడు. మల్లికార్జునకు దేవుడు శివుడు(ప్రకాష్ రాజ్) సహాయం చేస్తూ ఉంటాడు.


మల్లికార్జున మహేశ్వరిని చివరివరకు కాపాడగల అనేదే ఈ సినిమా యొక్క సారాంశం. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం చాలా బడ్జెట్ పెట్టినా అవి అంతగా బాగోలేదు. నాగార్జున సిక్స్ ప్యాక్ తో కనిపించినప్పటికీ... అతని నటన ఈ చిత్రంలో మెప్పు పొందలేదు. సినిమాలో ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఐటమ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు.


సక్కుబాయ్ గరం చాయ్ అనే ఐటమ్ సాంగ్ లో చార్మి కౌర్ తన అందాలతో సినీ చిత్రీకరణ సమయంలో నాగార్జునకు సెగ పుట్టించడం తో పాటు వెండితెరపై కూడా తళుక్కుమని తెలుగు ప్రేక్షక అభిమానులకు మత్తెకించింది. శృంగారభరితమైన డాన్స్ తో అందరి చేత వావ్ అనిపించిన ఛార్మి కౌర్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. ఈ పాటను సుచిత్ సురేశన్ మమతా శర్మ కలసి పాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: