పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే వెంకటేష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాడన్న సంగతి తెలిసిందే. ఓ మై గాడ్ హిందీ చిత్రానికి రీమేక్ అయిన గోపాల గోపాల సినిమా లో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో నటించాడు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమాలో... అదీ ఓ మలయాళ మూవీ రీమేక్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాడని సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ మొదలైన దగ్గర నుండి రీమేక్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ కూడా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన పింక్ సినిమా కి రీమేక్. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ రీమేక్ చిత్రాలలో నటించడానికి బాగా ఇష్టపడతాడు అని స్పష్టమౌతుంది.


ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళ చిత్రం లో ఆయన ఓ స్టార్ హీరో పాత్రలో నటించనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. 2019 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. పృథ్వీరాజ్ సుకుమారన్ స్టార్ హీరో పాత్రలో నటించగా... సూరజ్ వెంజరామూడు అభిమానుడు పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ సినిమా శీర్షిక చూస్తేనే ఈ కథ ఆర్టిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఆర్టీసీ ఆఫీసులో పనిచేసే ఓ అధికారి తన ఫేవరెట్ హీరో తో ఏర్పడే వివాదంలో ఎలా సమస్యలను పరిష్కరిస్తాడనేదే ఈ సినిమా యొక్క సారాంశం.


ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన అనంతరం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా తో పాటు హరీష్ శంకర్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ కథ పవన్ కళ్యాణ్ కి నచ్చినట్లయితే తను తన అల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తాడని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: