ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ లు అన్ని  ఆగిపోవడం తో సినీ సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఫ్యామిలీతో హాయిగా సమయాన్ని గడుపుపుతున్నారు సినీ సెలబ్రిటీలు. కేవలం తమ కుటుంబంతో సమయం గడపడమే  కాదు దానికి సంబంధించి వివరాలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్  సమయంలో అందరు సెలబ్రిటీలు కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. 

 

 తాజాగా ఇషా కొప్పికర్ ఒక ఫిట్నెస్  వీడియో ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో . ఫిట్నెస్  విషయంలో ఇషా కొప్పికర్ ఎంత కచ్చితంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో  ఇషా కొప్పికర్  తీవ్రమైన  శిక్షణ ఇవ్వడం మనం చూస్తున్నాం. మరోసారి ఫిట్నెస్ విషయంలో ఇషా కి  ఉన్న అంకితభావానికి రుజువు చేసింది. కేవలం సాధారణ వ్యాయామాలు మాత్రమే కాదు.. ప్రతి నటుడు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఆసక్తి కనబర్చాలి అంటు  ఇషా కొప్పికర్ తెలిపింది . 


 తాజాగా ఇషా కొప్పికర్ ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్  చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆమె టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ రూపం లో భాగంగా కొన్ని కదలికలు చేస్తున్నట్లు కనిపించింది. ఇక ఇషా కొప్పికర్ తనతో పాటు తన కుమార్తెను కూడా పక్కనే ఉంటుంది. వీడియో లో తన కుమార్తెకు కూడా మార్షల్ ఆర్ట్స్  పై శిక్షణ ఇస్తున్నట్లు గా ఉంది. కరోనా కు పంచ్  ఇవ్వడానికి తన కూతురుకి  సరైన మార్గం... ఇక్కడ ఉపయోగించే టెక్నిక్ బ్రాక్  అండ్ ఫంచ్ . టైక్వాండో మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ఎంతో  అద్భుతమైనది... అంటూ ఒక వివరణ కూడా ఇచ్చింది ఇషా కొప్పికర్.

మరింత సమాచారం తెలుసుకోండి: