లాక్ డౌన్ దెబ్బకి అన్ని రంగాలతో పాటు సినిమారంగం కూడా చాలా వరకు నష్టపోయింది. ముఖ్యంగా వేసవి సీజన్ కావటంతో చాలావరకు షూటింగ్ లో జరుపుకొని రెడీగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు లాక్ డౌన్ వల్ల ఆగిపోయాయి. అంతేకాకుండా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు అదే విధంగా పోస్టు ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా లాక్ డౌన్ దెబ్బకు ఆగిపోయాయి. సినిమా ధియేటర్ లోలు ఓపెన్ చేసే అవకాశం ప్రస్తుతం అయితే కనబడటం లేదు. ఎందు కంటే ఎక్కువగా వైరస్ గుంపులు గుంపులుగా ఉండేచోట వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో సినిమా ధియేటర్లు విషయంలో కేంద్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ ఏడాది సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు.

 

ఇటువంటి సమయంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల నిర్మాతలు మరియు దేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీలో పెద్దలు  నిరుత్సాహం చెందుతున్న సమయంలో కేంద్రం వారికి సరికొత్త ప్రయోగం చేకూరేలా ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే ఇక నుంచి ఆన్లైన్ ద్వారా సినిమాలకు సంబంధించి సెన్సార్ చేసుకోవచ్చట. సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనుకుంటే సదరు సినిమా నిర్మాతలు ఆన్లైన్ ద్వారా సెన్సార్ చేసుకోవచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 

కొంతమంది నిర్మాతలు ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో జాతీయ సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్న తరుణంలో ఓటీటీ ద్వారా ముందుగా రిలీజ్ చేసే అవకాశం ఉందని, అయితే ఈ విషయంలో రిలీజ్ అయిన సినిమాల నిర్మాతలకు లాభం వస్తే అప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ విధానం ద్వారా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: