ఇండస్ట్రీలో సినిమా సినిమాకు జాతకాలు మారిపోతుంటాయి. సక్సెస్ లో ఉన్నంత వరకే ఎవరి హవా అయినా నడుస్తుంది. ఫ్లాప్ వచ్చిందంటే సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇక డైరెక్టర్లు ఫ్లాపుల్లో పడ్డారంటే వాళ్ల కెరీర్ కష్టాల్లోకి వెళుతుంది. సక్సెస్ కొట్టాలనే ప్రెజర్ పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది దర్శకులు ఇలాంటి ప్రెజర్ లోనే సినిమాలు తీస్తున్నారు. 

 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మల్టీ స్టారర్ ట్రెండ్ కు బూస్టప్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈ దర్శకుడు బ్రహ్మోత్సవంతో డిజాస్టర్ లో పడ్డాడు. ఈ ఫ్లాప్ తో నాలుగేళ్ల పాటు మెగా ఫోన్ పట్టని శ్రీకాంత్ ఇప్పుడు నారప్ప సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. తమిళ హిట్ అసురన్ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. 

 

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా హిట్స్ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. కానీ ఈ హిట్స్ తర్వాత మేర్లపాక తీసిన కృష్ణార్జున యుద్ధం ఇతన్ని ఓడించింది. ఈ ఫ్లాప్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న గాంధీ ఇప్పుడు నితిన్ తో రీమేక్ చేయబోతున్నాడు. ఈ మూవీతో మళ్లీ ఫామ్ లోకి రావాలనుకుంటున్నాడు గాంధీ. 

 

థ్రిల్లర్ రొమాంటింగ్ జానర్ లో హిట్ కొట్టి యాక్షన్ మూవీతో బోల్తాపడ్డాడు చందూ  మొండేటి. కార్తికేయ, ప్రేమమ్ సినిమాలతో మెప్పించిన చందూ.. సవ్యసాచితో ఫ్లాప్ లో పడ్డాడు. ఇక ఈ డిజాస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని.. కార్తికేయ 2 చేస్తున్నాడు చందు. అయితే టాలీవుడ్ లో సీక్వెల్స్ కు ఫ్లాప్ సెంటిమెంట్ ఉంది. మరి కార్తికేయ2తో ఈ సెంటిమెంట్ ను ఎలా బ్రేక్ చేస్తాడో చూడాలి. 

 

వవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్  లాంటి స్టార్ హీరోస్ తో సినిమాలు తీసినా స్టార్ డైెరెక్టర్ కాలేకపోయిన బాబీకి రీసెంట్ గా మెగా ఆఫర్ వచ్చింది. చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు బాబీ. అయితే మెగాస్టార్ సినిమా అంటే జనరల్ గానే దర్శకులపై ప్రెజర్ ఉంటుంది. దీనికితోడు బాబి స్టార్స్ కు బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేకపోతున్నాడనే ఇమేజ్ ఉంది. మరి ఈ రెండింటిని బాబీ ఎలా డీల్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: