తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పలు సంచలనాలు సృష్టించిన నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ అమ్మడు చేసిన హల్ చల్ కి టాలీవుడ్ షేక్ అయ్యింది.  ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలంటే ఖచ్చితంగా పడక సుఖం అందించాల్సిందే.. ఇలా ఎంతోమంది జీవితాలతో చిన్న నుంచి బడాబాబుల వరకు ఆడుకున్నారని ఆరోపణలు చేసింది.  ఇలాా ఎన్నో సంచలనాలు సృష్టించిన శ్రీరెడ్డి తనకు రానా తమ్ముడు అభిరామ్ తో పరిచయం ఉందని.. తనను అడ్డగోలుగా వాడుకున్నాడని.. వాట్సాప్ లింక్స్, ఫోటోలు షేర్ చేసింది. ఇలా కొంత కాలం దగ్గుబాటి ఫ్యామిలీ వర్సెస్ శ్రీరెడ్డికి మద్య వార్ జరిగింది. ఆ మధ్య నానక్ రామ్ గూడా లోని రామానాయుడు స్టూడియో పడగొట్టిన సమయంలోనూ శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే.. త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్టు సినీ హీరో రానా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 

తన ప్రియురాలు మిహీకా బజాజ్ ను రానా పెళ్లాడబోతున్నాడు. పెళ్లి ఏర్పాట్ల ప్లానింగ్ లో ఉన్నట్టు రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబు కూడా వెల్లడించారు.  ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖలు రానాకి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, రామ్ చరణ్ ,మంచు మనోజ్ ,రాజమౌళి, సమంత, కాజల్,అనుష్క, శృతి హాసన్, హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ,అల్లు అర్జున్, క్రిష్, శోభు యార్లగడ్డ ,నితిన్ ,నిఖిల్ ఇలా సెలెబ్రిటీలంతా స్పందించారు తాజాగా వివాదాస్పద నటి, ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి కూడా ఈ అంశంపై స్పందించింది.

 

'మీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారు. ఆ అమ్మాయితో మీకు ప్రశాంతమైన జీవితం ఉండేలా భగవంతుడు దీవిస్తాడు' అంటూ ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.  మొన్నటి వరకు పెళ్లి ఊసు తీసుకు రాని రానా ఒక్కసారే పెళ్లివార్త చెప్పి షాక్ ఇచ్చారు. 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: