వరుస అప్డేట్ లతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన ఫ్యాన్స్  ను ఖుషి చేస్తున్నాడు. కొద్దీ రోజుల క్రితం రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్ నుండి నువ్వే నువ్వే  అనే సాంగ్ విడుదలకాగా  తాజాగా రేపు రామ్ బర్త్ డే సందర్బంగా ఈసినిమా లోని మాస్ సాంగ్  దించ్చక్ టీజర్ విడుదలకానుంది. ఈపాట లో రామ్ తన డ్యాన్స్ తో దుమ్ములేపనున్నాడట. ఇక కరోనా వల్ల ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడం తో తన పుట్టిన రోజు వేడుకలను జరుప్పొద్దంటూ  రామ్ తన ఫ్యాన్స్ ను కోరాడు. 
 
రెడ్ విషయానికి వస్తే కరోనా లేకుంటే ఏప్రిల్ లోనే విడుదలకావాల్సి వుంది కానీ ఈమహమ్మారి వల్ల విడుదలవాయిదాపడింది అయితే  ఇటీవల ఈసినిమా  డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలవుతుందంటూ వార్తలు వచ్చాయి అందుకు తగ్గట్లు ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ మేకర్స్  ఆ ఆఫర్ ను తిరస్కరించడం తో  మొదటి థియేటర్లలో విడుదలైన తరువాతే  ఆతరువాత  డిజిటల్ లోకి రానుంది. 
 
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడంకు రీమేక్  గా  తెరకెక్కుతున్న ఈచిత్రంలో రామ్ సరసన  మాళవిక శర్మ, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా బిగిల్ బ్యూటీ అమ్రితా అయ్యర్ కీలక పాత్రలో కనిపించనుంది. శ్రీ స్రవంతి  మూవీస్ బ్యానర్ పై రామ్ బాబాయ్ స్రవంతి రవి కిషోర్  నిర్మిస్తున్న ఈచిత్రానికి మణిశర్మ సంగీతం  అందిస్తుండగా చిత్రలహరి ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నాడు. ఇక రామ్ - కిషోర్ తిరుమల  కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో  నేను శైలజ ,ఉన్నది ఒక్కటే జిందగీ తెరకెక్కాయి. కాగా ఇస్మార్ట్ శంకర్ తో రామ్  బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో రెడ్ పై కూడా మంచి అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: