టాలీవుడ్ లో చిరంజీవి అంటే సెన్సేషన్ అప్పట్లో. వరుస విజయాలతో విబిన్నమైన పాత్రలతో చిరంజీవి ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించారు. అప్పట్లో చిరంజీవి డేట్స్ కోసం అగ్ర దర్శకులు, నిర్మాతలు లైన్లో ఉండేవారు. వారిలో మంచి మాగజైన్ ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ బాపినీడు ఒకరు. అయన చిరంజీవితో  పట్నం వచ్చిన పతివ్రతలు, హీరో, మగధీరుడు వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసారు. అయితే ఒక విభిన్నమైన కథతో చిరు హీరోగా ఒక సినిమా చేయాలని బాపినీడు గ్యాంగ్ లీడర్ కథని సిద్దం చేసారట. 

 

ఇండస్ట్రీలో మంచి స్టార్ హీరోగా ఉన్న చిరంజీవి బాపినీడు గారి కథ నచ్చక నిర్మొహమాటంగా నో చెప్పారని సిని వర్గాల కథనం. అయితే చిరు కంటే ముందు ప్రచురి బ్రదర్స్ కూడా ఆ కథని వినడం వల్ల మూడు రోజులు వ్యవధి ఇస్తే కథలోని మార్పులు ,చేర్పులు చేసి ఇస్తామని చెప్పారట బాపినీడు గారికి. తర్వాత కథలోని లోపాలను సరి చేసి చిరంజీవికి వినిపించగానే వెంటనే చిరు డేట్స్ ఇవ్వమని అరవింద్ కి చెప్పారని కథనం. అయితే కథను విన్న అల్లు అరవింద్ కథ అంతా రికార్డ్ చేసారు. ఇదంతా పక్కన పెడితే బాపినీడు రాసిన కథ చిరుకి ఎందుకు నచ్చలేదు అనుకుంటున్నారా..

 

బాపినీడు రాసిన కథలో హీరో అన్నయ్య, ఫ్రెండ్స్ అంతా ఒకే సారి చని పోతారు. గ్యాంగ్ లేకుండా గ్యాంగ్ లీడర్ ఏమిటి అని వద్దని చెప్పారు చిరంజీవి. అయితే పరుచూరి గోపాల కృష్ణ కథలో అలాంటి చిన్న చిన్న మార్పులు చేసి, విజయ శాంతి, రావు గోపాలరావు పాత్రల్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేలా చేశారు. దీని తో మంచి యాక్షన్, అండ్  రొమాంటిక్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా అతి పెద్ద హిట్ అందించింది. అంతేకాక చిరంజీవి డ్యాన్స్, హిట్ డైలాగులు, ఫైట్స్ అన్ని కూడా సినిమా విజయానికి కారణం అయ్యాయి. ఏది ఏమైనా ఈ సినిమాతో చిరంజీవి ఇమేజ్ అన్ని వర్గాల ప్రేక్షకుల్లో బాగా పెరిగిందనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: