ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటానికి ఉన్న అన్ని అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటుంది ఉపాసన. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఉన్న గుర్తింపు కంటే.. సామాజిక కార్యక్రమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. అపోలో గ్రూప్ కు చెందిన బి-పాజిటివ్ పత్రికను నిర్వహిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను చక్కగా వివరిస్తుంది. తాను చేసే వీడియోలకు ఇంటర్నెట్ లో మంచి క్రేజ్ ఉంది. కరోనా నేపథ్యంలో ఉపాసన చెప్పిన చిట్కాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టింది ఈ మెగా ఇంటి కోడలు.

 

 

తండ్రి అనిల్ రెడ్డితో కలిసి తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఫొటోలను ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అక్కడ ఆవు పేడ ఎత్తడం, గోవులు నీళ్లు తాగుంటే పరిశీలించడం, దాణా పెట్టడం చేసింది. ‘గోబర్ గర్ల్ విత్ డాడ్.. ది మోడర్న్ డే ఫార్మర్’ అని క్యాప్షన్ ఇచ్చుకుంది. ‘సేంద్రీయ వ్యవసాయం నేర్చుకుంటున్నాను. కంపోస్టింగ్, రోజువారీ ఆహార వ్యర్ధాలను తగ్గించడం, వాటిని తిరిగి ఉపయోగించుకోవడం ఎలానో తెలుసుకుంటున్నాను. దీని ద్వారా స్థిరమైన జీవిన విధానం పొందడం ఎలా.. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమెలాగో కూడా తెలుసుకుంటున్నాను’ అంటూ తన వాల్ లో రాసుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ కు నెట్టింట్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

 

‘ఇటువంటి పనులు చేస్తూ మీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు’, ‘సేంద్రీయ వ్యవసాయం ఉపయోగం తెలుస్తోంది’, ‘మీ సింప్లిసిటీ అందరికీ ఆదర్శం’ అంటూ మెగా కోడలిని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సేంద్రీయ వ్యవసాయం చేయాలంటూ ప్రభుత్వాలు కూడా విరివిగా ప్రచారం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉపాసన సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ పోస్ట్ ద్వారా ప్రకృతి వ్యవసాయమే మేలు అని ఉపాసన చెప్తున్నట్టుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: