తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ మొదలైన విషయం తెలిసిందే.  బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరించారు.  ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ, మరాఠీ భాషల్లో బిగ్ బాస్ వస్తుంది. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హైస్ట్ చేయగా, బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరించారు.  ఇటీవల వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3 కి కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరించారు. మొదటి సీజన్ కి శివబాలాజీ విన్నర్, రెండో సీజన్ కి కౌశల్ మంద మూడో సీజన్ కి రాహూల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచారు. అయితే నానా హూస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 మాత్రం చాలా టఫ్ గా భారీ కాంపిటీషన్ తో నడిచింది.  ఇందులో చివరి వరకు కౌశల్, గీతామాధురి నిలిచారు.  

 

ఇక బిగ్ బాస్ ఇంట్లో కౌశల్ కి ఇంటి సభ్యులకు ఓ రేంజ్ లో గొడవలు జరిగాయి.. ఒకదశలో మ్యాన్ హ్యాండిలింగ్ వరకు వెళ్లింది. ఆ సమయంలో కౌశల్ ఆర్మీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఒకదశలో ఈ సీజన్ మొత్తం కౌశల్ ఆర్మీ తో నానా రచ్చ జరిగింది. మొత్తానికి బిగ్ బాస్ అయ్యింది..  కౌశల్ కి వచ్చిన క్రేజ్ చూసిన వాళ్లంతా ఆయనకి వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తాయని భావించారు. కౌశల్ గానీ ఆయన అభిమానులుగాని ఆశించినట్టుగా అవకాశాలు రాలేదు.  

 

తాజాగా తాజాగా నటుడు  కౌశల్ కి ఒక అవకాశం లభించినట్టు  సమాచారం. హీరో  ఆదిసాయికుమార్ హీరోగా ఒక సినిమా రూపొందనుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం కౌశల్ ను తీసుకున్నారట. ఈ మూవీలో కౌశల్ ని చాలా కొత్తగా చూడబోతున్నారట.. ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుందనీ, తన కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని కౌశల్ భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: