టాలీవుడ్లో కరోనా మహమ్మారి భయం ఒక లెక్కలో ఉంది. దానికి వారూ వీరూ తేడా లేదు, హీరోలు, విలన్లు అంతకంటే లేదు. రీల్ లైఫ్ లో ఎంతటి హీరోలైనా రియల్ లైఫ్ లో మాత్రం మామూలు మనుషులే. అందులో సినిమా వారికి  భయాలు, సెంటిమెంట్లు కూడా చాలా ఎక్కువ. 

 

దీంతో కరోనా  నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తరువాత ఎంత మంది తిరిగి షూటింగులో పాలుపంచుకుంటారన్నది ఇపుడు పెద్ద చర్చ‌గా ఉంది. సాధారణంగా కరోనా మహమ్మారి వల్ల హైరిస్క్ 60 ఏళ్ళు దాటిన వారికి ఉంటుందని అంటున్నారు. దాంతో మామూలుగా అయితే ఉద్యోగాల్లో ఉన్న వారికి ఆ ఏజి కి రిటైర్మెంట్ ఉంటుంది. అదే మిగిలిన ఫీల్డ్ లో మాత్రం ఏజ్ ఫ్యాక్టర్ ఉండదు, ఇక సినిమా రంగంలో ఉన్న వారికి ఏజ్ లేదు. చివరి శ్వాస వరకూ నటిస్తూ పోవచ్చు.

 

ఇపుడు మాత్రం కరోనా వల్ల తప్పనిసరిగా ఆ ఏజ్ గ్రూప్ వారికి ఇబ్బంది ఎక్కువని అందరూ చెబుతున్నారు. దాంతో టాలీవుడ్లో సీనియర్ హీరోలు లాక్ డౌన్ తరువాత షూటింగులో పాల్గొంటారా లేదా  అన్న చర్చ సాగుతోంది. దీంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపు ఇచ్చినా కూడా షూటింగులకు హీరోలు రాకపోతే ఇబ్బంది తప్పదని కూడా భావిస్తున్నారు.

 

ఇక ఆ ఏజ్ కంటే బిలో ఏజ్ లో  ఉన్న హీరోలు షూటింగులో పాల్గొన్నా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిఉంటుందని అంటున్నారు. ఇదివరకూగా గ్రూపులుగా ఉండకూడదు, అలాగే సామాజిక దూరం పాటించడం పెద్ద ఇరకాటంగా ఉంటుంది. శానిటైజేషన్ నిరంతరం ఉండాలి. మాస్కులు ధరించాలి. 

 

ఇవన్నీ పాటిస్తూ షూటింగులలో పాలుపంచుకోవడం  కొత్త సమస్యలు అని చెబుతున్నారు. మొత్తానికి వాక్సిన్ వస్తే తప్ప కరోనా బాధ వీడదని అంటున్నారు. ఇపుడు సినిమాలకు, షూటింగులకు అదే పెద్ద స్పీడ్ బ్రేకర్ గా ఉందిట. వ్యాక్సిన్ కనుక ఇప్పట్లో రాకపోతే సీనియర్ హీరోలు కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా అశ్చర్యం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: