కరోనా వైరస్ వల్ల సినిమా ఇండస్ట్రీకి భయంకరమైన నష్టాలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఈ వేసవి సీజన్ చాలా వరకు మిస్ అయిపోయారు. చైనాలో విజృంభిస్తున్న సమయంలోనే హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన విడుదల కావాల్సిన సినిమాలు మొత్తం ఆపేశారు. ఎందుకంటే హాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతాయి కనుక వైరస్ ప్రభావం దృష్టిలో పెట్టుకుని ఏ సినిమా కూడా రిలీజ్ చేయలేదు. అంతే కాకుండా సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయకుండా ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. ఇటువంటి సమయంలో ఇటీవల ప్రస్తుతం వైరస్ ప్రభావం చాలావరకు  తగ్గటంతో పాటు ప్రజలందరికీ అవగాహన ఉండటం తో ప్రభుత్వాల నిర్ణయాలలో కూడా మార్పులు వస్తున్నాయి.

 

సోషల్ డిస్టెన్స్ మరియు పరిశుభ్రత పాటిస్తే మాక్సిమం కరోనా వైరస్ నుండి తప్పించుకున్నట్లే అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ అమెరికా రాష్ట్రంలో భయంకరంగా విజృంభించడంతో దేశ అధ్యక్షుడు చాలా రాష్ట్రాలలో షట్ డౌన్ ప్రకటించడం జరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా సినిమా ధియేటర్లు మొత్తం మొన్నటిదాకా క్లోజ్ అయిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా కరోనా వైరస్ ఉన్నా గాని హాలీవుడ్ సినిమా ఒకటి రిలీజ్ అవటం విశేషం. అదే .. గ్లాడియేటర్ ఫేం రస్సెల్ క్రో నటించిన క్రేజీ థ్రిల్లర్ చిత్రం `అనిహింగెడ్`.

 

అమెరికన్ థియేటర్లను తిరిగి తెరిచాక రిలీజవుతున్న తొలి సినిమా ఇదే. నిజానికి  ఈ మూవీని సెప్టెంబర్ 4 న విడుదల చేయాల్సి ఉండగా.. జూలై 1 వ తేదీకే వచ్చేయాలని మేకర్స్ నిర్ణయించారు. జులై ఫస్ట్ నుండి అమెరికాలో అన్నీ కార్యకలాపాలు యధావిధిగా జరుగుతాయని ట్రంప్ చెప్పడంతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి అంతా సవ్యంగా ఉంటే మిగతా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: