ఈ మధ్యనే జగదేక వీరుడు-అతిలోక సుందరి 30 ఏళ్ళ పండుగ జరిగింది. వేదికలు ఎక్కి ప్రసంగాలు లేవు కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియా వేదిక మీదనే సంబరం అంతా సాగింది. ఈ మూవీ క్లాసిక్ అన్నారు. ఈ మూవీ నభూతో నభవిష్యత్తు అన్నారు. ఇక ఈ మూవీ కోసం ఎంత కష్టపడినది కూడా హీరో నాని ద్వారా వాయిస్ ఓవర్ ఇప్పించారు.

 

అంతే కాదు, ఈ మూవీకి సీక్వెల్ కూడా తీస్తామని చెప్పారు. అది కూడా మెగాస్టార్ వారసుడు హీరోగా ఉన్న రాం చరణ్, అందాల నటి దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ లతో ఈ మూవీ ఉంటుందని కూడా ప్రచారం సాగింది. ఇక ఈ మూవీ సీక్వెల్ తీస్తే కానీ రిటైర్ అవనని కూడ గట్టిగానే చెప్పేశారు ఆ చిత్ర నిర్మాత అశ్వనీదత్

 

సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ మూవీ కధ కాపీనా అన్న దాని మీద కూడా మరో వైపు చర్చ వచ్చింది. అదేంటి అంటే ఈ సినిమా కంటే ముందు దాదాపుగా ఇదే కధాంశంతో రాజేంద్రప్రసాద్ హీరోగా రంభ-రాంబాబు మూవీ వచ్చింది. ఈ మూవీని హాస్య సినిమాల సూపర్ హిట్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు తీశారు. ఈ మూవీలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి పారిజాతను తీసుకున్నారు.

 

ఈ మూవీలో నారద పాత్రలో చంద్రమోహన్ నటించారు. ఇక ఈ మూవీ కధ కూడా సామన్య మానవుడుగా రాజేంద్రప్రసాద్ ఉంటే దేవలోకం నుంచి దిగి వచ్చిన రంభ అతన్ని ప్రేమిస్తుంది. ఇక ఈ సినిమాలో మానవుడు, దేవతల మధ్య రొమాన్స్ తో సాగుతుంది.అయితే ఇది పూర్తిగా లో బడ్జెట్ మూవీ. పైగా రాజేంద్రప్రసాద్ మూవీ కావడంతో ఆ రోజుల్లో చిన్నగానే ఆడేసి వెళ్ళిపోయింది. దాంతో ఎవరికీ గుర్తు లేదు.

 

ఆ తరువాత ఇదే కధను కాస్తా మార్చి జగదేక వీరుడు-అతిలోక సుందరి మూవీ తీశారని అన్న వారూ ఉన్నారు. ఈ మూవీకి ఇళయరాజా సంగీతం ఒక అసెట్. అలాగే శ్రీదేవి అందాలు మరో పెద్ద అసెట్. ఇక మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత అస్వనీదత్ ఇలా భారీగా అంతా ఉండడంతో ఈ మూవీ పెద్ద హిట్ అయింది.

 

మొత్తానికి ఒకే కధ సాదాసీదాగా ఒక మూవీ తయారైతే మరో మూవీ భారీ హిట్ కొట్టీంది. దీన్ని బట్టి కధలు అన్నీ ఒకేలా ఉన్నా వాటిని ఎలా తీశారు, ఎవరు చేశారు, ఎలా జనంలో ఇంపాక్ట్ కలుగచేశారు అన్నది కూడా ఇంపార్టెంట్ అన్నది జగదేక వీరుడు-అతిలోకసుందరి నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: