బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా విపరీతమైన క్రేజ్ ని సాధించాడు. దాదాపు బాహుబలి ఫ్రాంఛైజీ కోసం నాలుగేళ్ళు పడ్డ కష్ఠానికి ప్రతిఫలం పాన్ ఇండియా స్టార్ అన్న క్రేజ్. ఈ సినిమాతో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. అంతేకాదు బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో భారీ నిర్మాణ సంస్థల నుండి ఆఫర్స్ వస్తున్నాయి. అయినా ప్రభాస్ తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇక బాహుబలి తర్వాత సాహో చేసిన ప్రభాస్ బాలీవుడ్ లో మరింత క్రేజ్ ని దక్కించుకున్నాడు. 

 

ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తో మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రతిష్ఠాత్మకమైన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 50 వ చిత్రంగా నిర్మించబోయో సినిమాలో నటించబోతున్నాడు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని మహానటి ఫేం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ప్రభాస్ లా వరసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అదే క్రేజ్ ని దక్కించుకోవాలని టాలీవుడ్ స్టార్స్ అందరూ ప్రయత్నించడామే కాదు అందుకోసం విపరీతంగా శ్రమిస్తుస్తున్నారు కూడా.

 

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ తో ఖచ్చితంగా ఈ పాన్ ఇండియా క్రేజ్ ని ఎన్.టి.ఆర్. , రాం చరణ్ సాధించుకోవడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో ఇదే కేటగిరిలోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమా కూడా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఫైటర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే.

 

అయితే పవర్ స్టార్ కి ఇప్పటికే ఉన్న క్రేజ్ ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకి పాన్ ఇండియా క్రేజ్ రావడం పెద్ద కష్టమేమి కాదు. మహేష్ బాబు కూడా ఇదే తరహాలో ఉన్నాడు. ఆయనకి పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ రావడం అంత కష్టం కాదు. మరి ఎంతమంది ప్రభాస్ రేంజ్ ని అందుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: