దక్షిణాదిలో టాప్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసలో ఉండే పేరు త్రిష. ఓ దశలో తెలుగు, తమిళ్ లో నెంబర్ పొజిషన్ కూడా చూసింది. హీరోయిన్ గా 17ఏళ్ల లాంగ్ కెరీర్ ఈ అమ్మడి సొంతం. ఇంతటి లాంగ్ కెరీర్లో దక్షిణాదిలోని టాప్ హీరోలు అందరితోనూ హీరోయిన్ గా నటించింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ అడిగే పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా ఓ లైవ్ ఇంటరాక్షన్ లో త్రిష చెప్పిన సమాధానమే వైరల్ అవుతోంది.

 

 

అక్కడ ఓ అభిమాని నుంచి మీకిష్టమైన ముగ్గురు హీరోలెవరు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి మరో ఆలోచన లేకుండా.. ‘కమల్ హాసన్, అమీర్ ఖాన్, మోహన్ లాల్’ అని ఠక్కున చెప్పింది. అంతవరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడీ సమాధానమే తెలుగు ఆడియన్స్ కు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. త్రిష ఎదుగుదలకు, నెంబర్ వన్ స్టేటస్ కు తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడింది. రామ్ చరణ్, బన్నీ మినహా చిరంజీవి నుంచి నితిన్ వరకూ అందరి హీరోలతోనూ ఆడిపాడింది. అయినా తెలుగులో ఆమెకు నచ్చిన హీరో లేకపోవడమేంటనే ప్రశ్న వస్తోంది.

 

 

అమీర్ ఖాన్ తో ఇంతవరకూ త్రిష సినిమా చేయలేదు. మోహన్ లాల్ తో మొదటిసారి నటిస్తోంది. హీరోలతో ఫ్రెండ్షిప్ పక్కన పెట్టినా నటన పరంగా అద్భుతమైన నటులు మనకు ఉన్నారు. అయినా త్రిషకు తెలుగులో ఏ హీరో కనిపించకపోవడం విడ్డూరమే మరి. నటులుగా ఎవరి నటన ఇష్టమో చెప్పే హక్కు త్రిషకు ఉన్నా ఆమె సమాధానానికి నెటిజన్లు షాక్ అయ్యారు. చిరంజీవితో ఆచార్య మూవీ నుంచి తప్పుకుంది త్రిష. ప్రస్తుతం మళయాళంలో మోహన్ లాల్ తో రామ్, మణిరత్నం దర్శకత్వంలో పోన్నియన్ సెల్వం సినిమాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: