కోలీవుడ్ హీరో సూర్య అక్కడ స్టార్ హీరోయిన్ జ్యోతిక లవ్ మ్యారేజ్ గురించి తెలిసిందే. 2006లో వీరి మ్యారేజ్ జరిగింది. సూర్య జ్యోతిక కలసి పెళ్లికి ముందు 7 సినిమాల్లో కలిసి నటించారు. అభిరుచులు కలవడంతో వారు రీల్ లైఫ్ రిలేషన్ ను రియల్ లైఫ్ లో కూడా కొనసాగించారు.  సూర్య జ్యోతిక ఇద్దరు సూపర్ టాలెంటెడ్ ఆర్టిస్టులు.. హీరోగా సూర్య తన సత్తా చాటుతుంటే హీరోయిన్ గా జ్యోతిక పెళ్లికి ముందు చాలా మంచి సినిమాలు చేసింది. 

 

వీరిద్దరి లవ్ కి పెద్దల అంగీకారం లభించడంతో పెళ్లి చేసుకున్నారు. హీరోల్లో సూర్య చాలా డిసిప్లేన్ గా ఉంటాడు. హీరోగా తను కష్టపడి సంపాదించి అగరం ఫౌండేషన్ స్థాపించి దానికి తన సంపాదనలో కొంత మొత్తం కేటాయిస్తారు. హీరోగానే కాదు రియల్ లైఫ్ లో సూర్య చేస్తున్న పనులు నచ్చే జ్యోతిక సూర్య లవ్ ను యాక్సెప్ట్ చేసింది. 2006 సెప్టెంబర్ 11న వీరి మ్యారేజ్ జరిగింది. సూర్య, జ్యోతికలకు ఇద్దరు పిల్లలు వారి పేర్లు దియా, దేవ్ అని పెట్టరు. హీరోగానే కాదు నిర్మాతగా కూడా సూర్య సత్తా చాటుతున్నారు. 

 

జ్యోతిక నటిస్తున్న సినిమాలు నిర్మిస్తున్న సూర్య ఆ విధంగా కూడా సక్సెస్ ఫుల్ ట్రాక్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. పెళ్లి తర్వాత కొద్దిగా బిజీ అయిన జ్యోతిక ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలు చేస్తుంది. ఏది ఏమైనా సూర్యకి తగిన జోడీ జ్యోతిక అనిపించుకునేలా చేసింది. జ్యోతిక లీడ్ రోల్స్ చేస్తున్న సినిమాలు నిర్మిస్తున్నాడు సూర్య. ఈమధ్య కెరియర్ లో కొద్దిగా వెనుకపడ్డ సూర్య తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సూర్య కు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. గజినీ తో తెలుగులో ఫ్యాన్స్ ఏర్పరచుకున్నాడు సూర్య. అందుకే ఆయన ప్రతి సినిమా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: