ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ గా ఉన్న ద‌గ్గుబాటి వారి వంశాంకురం ద‌గ్గుబాటి రానా పెళ్లి విష‌య‌మే గ‌త రెండు రోజులుగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. రానా కు బాహుబ‌లి సినిమాలోని భ‌ళ్లాల‌దేవుడు క్యారెక్ట‌ర్ తో ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌స్తుతం రానా దేశ‌, విదేశాల్లో కూడా ఇదే పేరుతో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. ఇక రానా గ‌తంలో కొంద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ముందు త్రిష అన్నారు.. ఆ త‌ర్వాత ఓ క‌న్న‌డ హీరోయిన్ తోనూ లింకులు పెట్టారు. ఇక ఇప్పుడు ఫైన‌ల్‌గా రానా మిహీకా బ‌జాజ్ అనే ఓ అమ్మాయిని పెళ్లాడుతున్నట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాక్ ఇచ్చారు.

 

బాలీవుడ్‌లో బ‌జాజ్ ఫ్యామిలీకి చెందిన ఆమె మూలాలు ముంబైలో ఉన్నా ఆమె చ‌దువుకుంది... ఉండేది అంతా హైద‌రాబాద్ లోనే కావ‌డం విశేషం. ఇక రానా తాను మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే రానాకు శుభాకాంక్షలు చెపుతూ సోష‌ల్ మీడియా హోరెత్తి పోయింది. ఇక రానా తో కొద్ది రోజుల పాటు త్రిష ఎఫైర్ న‌డిపిన‌ట్టు టాక్ ఉంది. వారిద్ద‌రు మీడియా కంటికి కూడా ప‌లుసార్లు దొరికిపోయారు. ఆ త‌ర్వాత ఆమెకు పారిశ్రామిక వేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా క్యాన్సిల్ అయ్యింది.

 

ఆ త‌ర్వాత కూడా రానా , త్రిష మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ఇప్పుడు రానా త‌న ప్రియురాలి గురించి ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ప‌లువురు శుభాకాంక్ష‌లు చెప్ప‌గా త్రిష నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. ఈ క్ర‌మంలోనే రానా ఫోన్ చేస్తే త్రిష లిఫ్ట్ చేయ‌లేద‌న్న టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. రానా ఓ స్నేహితురాలిగా త్రిష కు ఈ విష‌యాన్ని చెప్పాల‌ని చూశాడా ?  అన్న చ‌ర్చ న‌డుస్తోంది. అయితే త్రిష ఎందుకు ఫోన్ ఎత్తక‌పోవ‌డంపై కూడా ర‌క‌ర‌కాల సందేహాలు వ‌స్తున్నాయ్‌..! మ‌రి త్రిష ఎప్పుడు ఓ ఇంటిది అవుతుందో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: